Tuesday, May 7, 2024
- Advertisement -

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రి కాకుండా మ‌హేశ్ అయ్యాడు..

- Advertisement -

సినిమా క‌థ‌లు ఒక‌రికి వ‌స్తే వారు తిర‌స్క‌రించి మిగ‌తా వారికి వెళ్ల‌డం సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌సాధార‌ణం. ఆ విధంగా తాము మిస్ చేసుకున్న సినిమాలు విడుద‌లై హిట్ట‌యితే మాత్రం ఆ న‌టులకు ఎంతో బాధేస్తుంది. ప్ర‌స్తుతం ఆ బాధ‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా ‘భరత్ అనే నేను’. మొద‌ట ఈ క‌థ‌ను ర‌చ‌యిత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను దృష్టిలో ఉంచుకొని క‌థ రాసుకున్నాడు అని స‌మాచారం. ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఎలా ఉంటాడో అని ఊహించుకుని ఈ క‌థ‌ను ర‌చించాడు. అస‌లు ఈ క‌థ కొర‌టాల శివ రాసుకున్న‌ది కాదు. శ్రీహ‌రి నాను అనే వ్య‌క్తి ‘భరత్ అనే నేను’ సినిమా క‌థ రాశాడు. ఈ క‌థ‌ను కొర‌టాల శివ రూ.కోటి వెచ్చించి ఈ క‌థ‌ను కొనుగోలు చేశాడు.

ఈ క‌థ విష‌య‌మై ఇటీవ‌ల శ్రీహ‌రి స్పందించాడు. ఈ క‌థ‌ను పవర్‌స్టార్ కోసమే రాసుకున్నట్టు చెప్పాడు. 2014లో పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించ‌డంతో ఆ త‌ర్వాత వచ్చిన ఆలోచనతోనే ఈ కథ రూపొందించారు. పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనే ఆలోచ‌న‌తోనే ఈ క‌థ‌ను సిద్ధం చేశానని శ్రీహ‌రి చెప్పాడు. ఈ క‌థ‌ను ప‌వ‌న్‌కు చెప్ప‌గా న‌చ్చేసింది. కానీ పార్టీ పెట్ట‌డంతో ఈ సినిమా తీస్తే ప్ర‌జ‌ల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంద‌నే భావంతో చేయ‌న‌ని చెప్పేశాడ‌ని స‌మాచారం.

ఈ విష‌యం తెలిసి కొర‌టాల శివ ఈ క‌థ‌ను కొనుగోలు చేసి మ‌హేశ్‌బాబు కోసం కొంచెం మార్పులు చేర్పులు చేశాడు. చివ‌రికి మ‌హేశ్‌ను ఒప్పించి ‘భరత్ అనే నేను’ సినిమాను పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. గ‌తంలోనూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ‘పోకిరి’ సినిమా వెళ్ల‌గా అత‌డు చేయ‌క‌పోవ‌డంతో మ‌హేశ్ చేశాడు. మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -