Saturday, April 27, 2024
- Advertisement -

గ‌ర్భంతో ర్యాప్ వాక్ చేసిన స్టార్ హీరోయిన్‌

- Advertisement -

ఎమీ జాక్స‌న్ తెలుగు , త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టించిన ఐ, రోబో 2.0 సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే గ‌త‌కొంత‌కాలంగా ఎమీ బిజినేస్ మ్యాన్ బ్రిటీష్ బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌతో డేటింగ్ చేస్తోంది. ఈ డేటింగ్‌లో భాగంగా ఎమీ పెళ్లి కాకుండానే గ‌ర్భ‌వ‌తి అయింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. తాజాగా ఎమీ ఓ ఫ్యాష‌న్ ఈవెంట్‌కు హాజ‌రై అక్క‌డ ఉన్న‌వారంద‌రిని ఆశ్చ‌ర్చ‌ప‌రిచింది.

ఎమీ జాక్స‌న్ బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఎమీ రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో క‌నిపించి మురిపించింది. బేబి బంప్ ర్యాంప్ వాక్‌లో త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టింది. ఎమీ బేబి బంప్‌పై నెటిజ‌న్ల నుంచి అద్భుతమైన స్పంద‌న వ‌స్తోంది. ఎమీ ఏకంగా కవలల్ని కనాలని ఆశీర్వదించారు. మరికొందరు ఈ రూపంలో హ్యాపీనా, అనుకున్నది సాధించావా? అని ప్రశ్నించారు. ఇంకొంద‌రు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ప్ర‌శ్నిస్తున్నారు. పిల్ల‌లు క‌న్నా త‌రువాతే ఎమీ పెళ్లి చేసుకుంటుంద‌ని వారి స‌న్నిహితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -