Sunday, May 12, 2024
- Advertisement -

జూనియర్ దేవరకొండ కి సువర్ణావకాశం

- Advertisement -

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ త్వరలో దొరసాని అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ని 12 జులై న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నద్ధం అవుతున్నారు. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు జులై 12 చిత్ర యూనిట్ కి చాలా అనువైన సమయం అని తెలుస్తుంది. ఇంతకు ముందు రామ్-పూరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా ని కూడా అదే తేదీన విడుదల చేయాలి అని భావించారు. కాకపోతే క్రికెట్ వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమా ని వాయిదా వేశారు. ఈ సినిమా ఇప్పుడు 18న విడుదల అవుతుంది.

ఇంక ఆ రోజున పెద్దగా పేరున్న సినిమాలు ఏమి విడుదల అవ్వడం లేదు. దీనితో ఆనంద్ దేవరకొండ కి అలాగే శివాత్మిక రాజశేఖర్ కి ఇదొక సువర్ణావకాశం అని చెప్పచ్చు. ఈ సినిమా తో ఈ ఇద్దరు మొదటి సారి తెరంగేట్రం చేయనున్న నేపథ్యం లో మొదటి సినిమా కి సోలో రిలీజ్ అడ్వాటేజ్ అవ్వడం కచ్చితం గా విశేషం అని చెప్పుకోవచ్చు.

కే వీ ఆర్ మహేంద్ర దర్శకత్వం లో రానున్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో కలిసి = బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -