Thursday, May 9, 2024
- Advertisement -

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం జగన్ సీరియస్ కామెంట్స్….

- Advertisement -

సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో త‌న మార్క్‌ను పూర్తి స్థాయిలో చూపించేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇవాలా ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సులో జ‌గ‌న్ సీరియ‌స్ వ్యాఖ్య‌ల చేశారు. అవినీతి ఏస్థాయిలో ఉన్న ఉపేక్షించ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా స‌రే అవినీతి పట్ల క‌ఠినంగా వ్వ‌వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

అవినీతి, దోపిడీని తమ ప్రభుత్వం ఎంత మాత్రం సహించదని, ఎమ్మెల్యేలు, అధికారులు తమకు రెండు కళ్లు అని తెలిపారు. కాంట్రాక్ట్ అంటే అవినీతి అనే స్థాయికి తీసుకొచ్చారని, ఇందులో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిటీ అడిగామని తెలిపారు. ఎందులోనైనా అవినీతి జరిగినట్టు రుజువైతే వాటిని రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోడ్ చేసిన వారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు.

మనం కూర్చున్న ప్రజా వేదిక భనవం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదే అన్నారు. ప్రజావేదిక నుంచే అక్రమ కట్టడాల కూల్చివేత మొదలవుతుందన్నారు. ఎల్లుండి నుంచి ప్రజావేదికను కూల్చేస్తామన్నారు సీఎం. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పడానికే ప్రజా వేదికలో సమావేశం పెట్టానన్నారు. మనం పాలకులం కాదు సేవకులమన్న విషయం గుర్తు ఉంచుకోవాలనుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి అర్హుడికి అందాలని అన్నారు. ఇందు కోసం గ్రామ సచివాలయం, వలంటీర్లు ముఖ్య పాత్ర పోషించబోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఒక వేల వాలంటీర్లు అవినీతికి పాల్ప‌డితే సీఎంవోకు స‌మాచారం అంద‌జేయ‌వ‌చ్చ‌ని, త‌ప్పు చేసిన‌ట్లు తేలితే వారి స్థానంలో కొత్త వారిని నియ‌మించాల‌ని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -