బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఇప్పుడు అదిరిపోయే క్రేజ్ ఉంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తోంది. తన గ్లామర్ తో ప్రేక్షకులకు పిచ్చేక్కించడమే కాదు.. తను చేసే షో టీఆర్పీ రేటింగ్ కూడా పెంచేస్తోంది. జబర్థస్త్ టీఆర్పీల వెనక అనసూయ గ్లామర్ ఎంత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అలానే మరో ఛానెల్ లో వచ్చే లోకల్ గ్యాంగ్… ప్రతిరోజు పండగే… రియాలిటీ షోలోనూ అనసూయ అదరగొడుతోంది. ఇక తాజాగా జెమినీ చానెల్ లో అనసూయ కొత్త కార్యక్రమం తల్లా? పెళ్లమా?
అగ్గి రాజేయబోతోంది. ఈ షో ఎంత స్పైసీగా ఉండనుందో తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్దం అవుతోంది. ’తల్లా ? పెళ్ళమా ?’ ఎంత సాంప్రదాయ బద్ధంగా ఉన్నా..హోస్ట్ అనసూయ హీటెక్కించే లుక్ .. ఒంపుసొంపుల నయగారం కళ్లప్పగించేలా చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
జీవితం అనే చదరంగం ఆటలో తల్లా? పెళ్లమా? నా ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటూ అనసూయ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. తాజా ప్రోమోని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి హైప్ క్రియేట్ చేసింది అనసూయ. ఇక మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాలో అనసూయ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. అలానే మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టింది.