Sunday, May 12, 2024
- Advertisement -

అనసూయ… మరో కొత్త ఫీట్ సాధించింది!

- Advertisement -

ఇప్పటికే యాంకరింగ్ విషయంలో స్టార్ స్టేటస్ సాధించుకుంది అనసూయ.

మొదట “సాక్షి” టీవీలో న్యూస్ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ చానళ్ల వైపు వెళ్లింది అనసూయ. మొదట్లో ఈవెంట్ మేనేజర్ గా ఇంటర్వ్యూలు చేస్తూ… వాటిని చానళ్లకు అమ్ముకున్న అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ తో ఒక వెలుగు వెలిగింది. బూతు ప్రోగ్రామ్ గా పేరు తెచ్చుకున్నా.. ఆకార్యక్రమం బాగా పాపులర్ కావడం అనసూయకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఆమె సినీ ఎంట్రీ గురించి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకు అది ఇప్పుడు జరుగుతోంది.

సోగ్గాడే చిన్నా నాయన సినిమాతో ఆమె తెరంగ్రేటం చేయనుంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె ఇప్పుడు మరో ఫీట్ సాధించింది. తను ఒక చీరల షాపు కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ విధంగా హీరోయిన్లకు పోటీగా వచ్చిందామె. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఈ విషయంలో దూసుకుపోతున్నారు. అలాంటి వారి మధ్యన అనసూయ కూడా చీరలను ప్రదర్శించబోతోంది. మరి తొలి సినిమా కూడా విడుదల కాకముందే.. ఇలా చీరల షాపులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం అనసూయకే సాధ్యం అవుతుందేమో.

ఇదిలా ఉంటే అనసూయ తన తరువాయి సినిమాకు కూడా సైన్ చేనట్టుగా సమాచారం. మరి హీరోయిన్ గా కూడా అనసూయ దూసుకుపోతోందేమో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -