Tuesday, May 21, 2024
- Advertisement -

7 న సిటీ కేబుల్ రాదు

- Advertisement -

డిజిటల్ బాక్సుల గోల తో జనం విసుగ్గా ఉన్నారు, డిజిటల్ బాక్సులు పెట్టుకుంటే కానీ కేబుల్ రాదు అని కొత్త రూల్సు రావడం తో ఎక్కడ నుంచి వారు ఆ బాక్సు కోసం పదిహేను వందలు తీసుకుని రాగలం రా బాబు అంటున్నారు ఇప్పుడు.

కేబుల్ ఆపరేటర్ లకి కూడా ఈ విధానం నచ్చలేదు కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పడం లేదు మరి వారికి కూడా. నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పు నెమ్మది నెమ్మదిగా పెద్ద ఊళ్లలో అమలు చేస్తూ వచ్చి చివరకి ఇప్పుడు గ్రామాల స్థాయి కి చేరుకుంది. దీని విషయం లో కేబుల్ ఆపరేటర్ లు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంత సొమ్ము పెట్టి బాక్సులు కొనడం ఇష్టం లేని జనాలు కేబుల్ టీవీ లు ఊళ్ళల్లో పీకేస్తున్నారు . ఇస్తే డైరెక్ట్ గా ఇవ్వండి లేదంటే మాకసలు వద్దే వద్దు అని గొడవ చేస్తున్నారు. 

మరొక పక్కక చూస్తే సుప్రీం కోర్టు తీర్పుతో డిజిటల్ లేకపోతే టీవీ లో కేబుల్ ఇవ్వలేని పరిస్థితి కేబుల్ ఆపరేటర్ లది. ఈ పరిస్థితి లో జనల మధ్య నలుగుతున్నారు కేబుల్ వారు. డిజిటలైజేషన్ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 7 ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు టీవీ ప్రసారాలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.జితేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు సతీశ్‌ముదిరాజ్ తదితరులు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని కేబుల్ వినియోగదారులు ఇందుకు సహకరించాలని వారు కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -