Thursday, May 2, 2024
- Advertisement -

ట్విట్ట‌ర్‌లో అభిమానిపై ఫైర్ అయిన రష్మీ

- Advertisement -

రష్మీ తెలుగు పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో ఒక‌రు.జ‌బ‌ర్థ‌స్త్‌,ఢీ షోల‌తో మంచి పాపుల‌రిటీ సంపాదించుకుంది.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ర‌ష్మీ.అయితే త‌న ట్విట్ట‌ర్‌లో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు కోపంగా స‌మాధానం ఇచ్చింది. ‘సుధీర్‌ని పెళ్లి చేసుకో మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు’, అని ఓ అభిమాని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు.దీనిపై కోపంతో ర‌ష్మీ మేము స్క్రీన్ మీద న‌టించడం మాత్ర‌మే చూశారు.

అంతేగాని మేము ఒక‌రి కోసం ఒక‌రు పుట్టాము అని ఎలా అంటార‌ని ఆ అభిమానిపై మండిప‌డింది.రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. నాకు నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు’ అని తెలిపింది.

.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -