Friday, May 3, 2024
- Advertisement -

అలాంటి మ‌గ‌వారు అస్స‌లు న‌చ్చ‌రు – యాంక‌ర్ ర‌ష్మి

- Advertisement -

తెలుగు ప్ర‌ముఖ యాంక‌ర్స్‌లో ర‌ష్మి గౌత‌మ్ ఒక‌రు. గ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించ‌న‌ప్ప‌టికి రాని గుర్తింపు ప్ర‌ముఖ ఈటీవీ చానెల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ భామ‌కు ప‌లు సినిమాల‌లో న‌టించే అవ‌కాశం కూడా ద‌క్కింది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్‌గా క‌నిపిస్తు అభిమానులను అల‌రిస్తుంటుంది ర‌ష్మి . సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్ గురించి ర‌కార‌కాల వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి , రాసుకునే వాళ్ల‌ను రాసుకోనివ్వండి అంటూ స‌మాధానం ఇచ్చింది ర‌ష్మి.

ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది ర‌ష్మి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమాలు,షోల వివారాల‌తో పాటు గ్లామ‌రెస్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఆడ‌వారి వస్త్రధారణ ఎలా ఉండాలనే దానిపై చ‌ర్చ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసింది. తాజాగా దీనిపై స్పందించింది ర‌ష్మి. ఇటీవ‌లే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆడ‌వారి వస్త్రధారణ గురించి మాట్లాడారు.తప్పు ఆడవాళ్ళ దుస్తుల్లో లేదని, మగవాళ్ళ కామం నిండిన చూపుల్లో ఉందని నాగబాబు ఫైర్ అయ్యారు.

దీనిపై స్పందించిన ర‌ష్మి…ఆడ‌వారికి మ‌ద్ద‌తుగా మాట్లాడిన‌ నాగ‌బాబు గారికి కృత‌జ్ఞాత‌లు తెలిపింది. మగవాళ్ళ డ్రెసింగ్‌లో మీకు న‌చ్చేవి ఏంటి అని ర‌ష్మిని ప్ర‌శ్నించాడు ఓ అభిమాని.అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం ఇచ్చి అత‌నికి షాకిచ్చింది. నాకు షార్ట్స్ వేసుకుని కాళ్ళపై బొచ్చుతో తిరిగే వారంటే నాకు అస్స‌లు న‌చ్చ‌ద‌ని చెప్పుకొచ్చింది. ఇక్క‌డితో ఆగితే బాగుండేది,కాని ఇంకా చాలా చెప్పుకొచ్చింది ర‌ష్మి. కట్ బనీన్లు వేసుకొని చంకల్లో వెంట్రుకలు కన్పిస్తూ ఉన్నా నచ్చదు. హాఫ్ షర్ట్స్ వేసుకొని చేతులను ఓవర్‌గా ఎక్స్ పోజ్ చేసేవారు న‌చ్చ‌రు.

బీచుల్లో చొక్కా బనియన్లు లేకుండా వేలాడే చెస్ట్ తో అటూ ఇటూ తిరిగేవాళ్ళంటే అస్సలు నచ్చదని చెప్పుకొచ్చింది. ఇవేనా ఇంకా చాలా ఉన్నాయి. అవి అన్ని చెబితే మ‌గాడు బ‌య‌టికి తిర‌గ‌డానికి కూడా భ‌యం వేస్తుంద‌ని చెప్పి ఆ అభిమానికి దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. ర‌ష్మి మాట్లాడిన తీరును చాలామంది ప్రశంసిస్తున్నారు. తాను హాట్ యాంక‌ర్‌నే కాద‌ని ఫైర్ బ్రాండ్‌ని మ‌రోసారి నిరుపించుకుంది ర‌ష్మి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -