Friday, May 17, 2024
- Advertisement -

అవే పాత్ర‌లొస్తున్నాయ్‌.. చేయ‌లేనంటున్న యాంక‌ర్‌

- Advertisement -

ఒక పాత్రలో మంచిగా న‌టిస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ అవే పాత్ర‌లు రావ‌డం న‌టీన‌టుల‌కు స‌ర్వ‌సాధార‌ణం. మ‌ళ్లీ అలాంటి పాత్ర‌లు రావ‌డం పై ఓ యాంక‌ర్‌, న‌టి అసంతృప్తితో ఉంది. అలాంటి పాత్ర‌లే త‌ర‌చూ రావ‌డంతో తాను చేయ‌న‌ని ఏకంగా సినిమా అవ‌కాశాలు వ‌దిలేసుకుంటోంది. ఆమెనే ర‌ష్మీ గౌత‌మ్‌. ఒక సినిమాలో ఆ పాత్ర‌లో హిట్ట‌యితే అదే జోనర్ మ‌ళ్లీ మ‌ళ్లీ పాత్ర‌లు వ‌స్తున్నాయని ర‌ష్మీ ఆందోళ‌న‌లో ఉందంట‌.

ఈమధ్య తనకు అన్నీ హారర్ కామెడీ స్క్రిప్టులే వస్తుండ‌డంతో ఆ సినిమాలు చేయ‌న‌ని చెబుతోంది. ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలు హారర్ జోనర్‌లో చేయ‌డంతో అప్పటి నుంచి అన్ని స్క్రిప్టులు అలాంటివే వ‌చ్చాయంట‌. హారర్ కథలు వినీవిని అలసిపోయాను కానీ ఎందుకు వాళ్లంతా నన్ను అలాంటి రోల్స్‌కు అడుగుతారో త‌న‌కు అర్థం కావట్లేదని చెప్పింది.

నేను అన్నీ అలాంటి సినిమాలు చేసుకుంటూ పోలేను అంటూ ర‌ష్మీ తేల్చి చెప్పేసింది. తనకు జీవితాన్నిచ్చిన టీవీ షోలను ఎప్పటికి మర్చిపోను అని చెబుతోంది. ప్ర‌స్తుతం జ‌బర్దస్త్, అనుభవించు రాజాలాంటి షోలతో ర‌ష్మీ బిజీగా ఉంది. ఇక అవ‌కాశం వ‌స్తే వెబ్ సిరీస్‌లో నటించాలని ఆస‌క్తి ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -