Wednesday, May 15, 2024
- Advertisement -

పాకిస్తాన్‌లో సౌరవ్ గంగూలీ డేరింగ్ గట్స్……. వార్నింగ్ ఇచ్చిన ముషారఫ్

- Advertisement -

భారతదేశ క్రికెట్ నడవడిక తీరు తెన్నులు మార్చిన ఇద్దరు ముగ్గురు ఆటగాళ్ళలో గంగూలీ ఒకడు. భారత క్రికెట్‌కి నిబద్ధతను, కష్టపడడాన్ని నేర్పించాడు కపిల్. యాభై ఆపరేషన్స్ అయినా పట్టుదలతో విజయం కోసం శ్రమించేవాడు కపిల్. కపిల్ తర్వాత ఇండియన్ క్రికెట్ దిశను మార్చింది గంగూలీనే. గంగూలీకి ముందు వరకూ కూడా అవమానించినా తల వంచుకుని ఉండాలనే తరహాలో ఇండియన్ క్రికెటర్స్ ఉండేవాళ్ళు. కానీ గంగూలీ మాత్రం దెబ్బకు దెబ్బకొట్టాలి అన్న తత్వం నేర్పాడు. చాలా మంది చాదస్తులైన సీనియర్స్ విమర్శించారు కానీ ఇండియన్ క్రికెట్‌కి గంగూలీ నేర్పిన పాఠాలు చాలానే నేర్పించాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా గంగూలీకి అప్ గ్రేడెడ్ వెర్షన్ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తున్నాడు.

క్రికెట్ విషయం పక్కనపెడితే ఆఫ్ ది ఫీల్డ్ కూడా గంగూలీకి ధైర్యం ఎక్కువ. 2004లో పాకిస్తాన్‌లో పర్యటించిన టీం ఇండియాకు నాయకుడు సౌరవ్. పాకిస్తాన్‌లో ఇండియాకు టెస్ట్ సిరీస్ సాధించి పెట్టిన ఒకే ఒక్క నాయకుడు కూడా. ఆ సిరీస్ సందర్భంగానే గంగూలీ సెక్యూరిటీకి చెప్పకుండా కూడా బయటికి వెళ్ళేవాడు. అత్యంత గట్టి సెక్యూరిటీ మధ్య ఉండాల్సిన ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధైర్యంగా సెక్యూరిటీ లేకుండా పాకిస్తాన్‌లో తిరిగాడు. గంగూలీని గుర్తుపట్టిన ఒక పాకిస్తానీ పాకిస్తాన్‌కి మీలాంటి నాయకుడు కావాలని అడిగాడు. అలాగే మారు వేషంలో ఉన్నప్పటికీ గంగూలీని చాలా మంది పాకిస్తానీలు గుర్తుపట్టేవాళ్ళట. గంగూలీని అభిమానంగా చూసేవారట. అయితే ఒక సందర్భంలో మాత్రం ఒక వ్యక్తి కారు అద్దాలు దించమని డిమాండ్ చేశాడట. అతను టెర్రరిస్టేమో……. బాంబు వేస్తాడేమో అని సౌరవ్ భయపడితే అతను మాత్రం పాకిస్తాన్‌కి కూడా నీలాంటి నాయకుడు కావాలని పొగిడేశాడట. అయితే సౌరవ్ చాలా ధైర్యంగా చేసిన స్టంట్స్ అన్నీ కూడా ముషారఫ్‌కి తెలిసిపోయాయట. ఆ వెంటనే సౌరవ్‌కి పర్సనల్‌గా కాల్ చేసిన ముషారఫ్…….. ‘నువ్వు లైఫ్ రిస్క్ చేస్తున్నావు తెలుసా’ అని చెప్పి సౌరవ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ మొత్తం ఎపిసోడ్‌ని తన ఆత్మకథలో చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ. గంగూలీ అభిమానులు మాత్రం సౌరవ్ గట్స్‌ని వేనోళ్ళ ప్రశంసిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -