తెలుగు ప్రముఖ యాంకర్స్‌లో రష్మి కూడా ఒకరు. తన నటన, అందంతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది రష్మి. తోటి యాంకర్ సుధీర్ తో రూమర్స్‌తో బాగా పాపులర్ అయింది. ఉన్నది ఉన్నట్లు ,ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పడంలో రష్మి ముందు ఉంటోంది. తాజాగా రష్మి మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే పీరియడ్స్ సమస్య గురించి బహిరంగంగానే ధైర్యంగా మాట్లాడింది. ఇండియాలోనే మొట్ట మొదటి ట్రక్ డ్రైవర్‌గా పేరు దక్కించుకున్న యోగితా రఘువంశీ గురించి ట్వీట్ చేసింది.
మహిళ అయి ఉండి ట్రక్ డ్రైవర్‌గా పని చేయడాన్ని రష్మి యోగితాను పొగుడుతు ఓ ట్విట్ చేసింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే పీరియడ్స్ సమస్యను సైతం పక్కన పెట్టి మరి తన కుటుంబం గురించి కష్టపడటం గురించి ఎంత చెప్పిన తక్కువేనని తెలిపింది. రోడ్డు పక్కన కనీసం మూత్ర విసర్జనకు కూడా సరైన సదుపాయాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ట్రక్ డ్రైవింగ్ చేయడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయమే అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై కూడా పనిగట్టుకుని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
- Advertisement -
పీరియడ్స్ గురించి ట్విట్ చేసిన యాంకర్ రష్మి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -