కుళ్లు రాజ‌కీయాలు మానేయాలి ‘వకీల్ సాబ్ ’పై పూనమ్ కౌర్ ‌ సెన్సేషనల్ కామెంట్స్‌..!

- Advertisement -

పూనమ్‌ కౌర్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ కామెంట్స్ చేయడం తెలిసిన విషయమే. ఇక మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన మొదటి రోజే హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ‘వ‌కీల్ సాబ్’ వంటి పెద్ద సినిమాకు బెనిఫిట్, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం జీవోలను విడుదల చేసి ఆటంకాలు సృష్టించింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమాపై ట్విట్టర్‌ మాధ్యమంగా సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది. ‘సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన వివాహంలాంటిది. ఇది ఒక వ్యవస్థీకృత సంబంధం. ఇది కేవలం కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాలి. కాపురం చేయకుంటే ప్రజలే బాధపడతారు.

- Advertisement -

ఇక డీ ఫేమింగ్‌ ఆర్గనైజ్డ్‌ ట్రెండ్‌ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్లు రాజకీయాలు?. అమ్మాయిలను డీఫేమ్‌ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్‌ ఎవరికి? పోసానిగారు ప్రెస్‌మీట్‌?” అంటూ పోసాని కృష్ణమురళిని టార్గెట్‌ చేస్తూ పూనమ్‌ చేసిన ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

అంతా రక్తం.. మొత్తం హింస, పొలింగ్ వాయిదా..!

కరోనా చికిత్స పై ..ఈటల రాజేందర్‌ కీలక నిర్ణయం..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -