బుల్లితెరపై రవి, లాస్య అంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. స్టార్ మాలో వారిద్దరు కలిసి చేసిన సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యాంకర్స్‌గా చేసిన రవి, లాస్యకు మంచి గుర్తింపు దక్కింది. లాస్య చీమ జోకులు.. ఆమెపై రవి వేసే పంచ్ లు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకున్నాయి. అయితే తర్వాత ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని షో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత లాస్య పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. రీసెంట్‌గా బిగ్‌బాస్ 4లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇక రవి మాత్రం వివిధ చానళ్లలో పలు షోలు చేశాడు. లాస్య స్థానంలో శ్రీముఖి, వర్షిణి, భాను శ్రీ ఇలా ఎంతో మంది వచ్చారు వెళ్లారు. కానీ లాస్య రవి చేసిన మ్యాజిక్‌ను మాత్రం ఎవ్వరూ రిపీట్ చేయలేకపోయారు. ఇదిలా ఉంటే.. లాస్య రీ ఎంట్రీ తర్వాత రవి, లాస్య ఏదైనా షో చేస్తే బావుంటుందని చాలా మంది అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే దాదాపు ఐదేళ్ల తర్వాత రవి, లాస్య కలిసి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ షోను హోస్ట్ చేస్తున్నారు.
తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది స్టార్ మా. ఈ షోతో ఇద్దరు మధ్య ఉన్న మనస్పర్థలు తొలగినట్టు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే క్షమించు అని అందరి ముందే లాస్యను రవి అడిగేశాడు. లాస్య, రవి కలుసుకుంటున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో హ్యాపీడేస్ మ్యూజిక్ ప్లే కావడం నుంచి ప్రతిదీ వేరే లెవల్లో ఉంది. అన్నిటికన్నా అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం లాస్య కొడుకు జున్ను… రవి కూతురు కలిసి షేక్ హ్యాండ్స్ చేసుకోవడం. మొత్తానికి ఈ ఇద్దిరిని ఇలా చూడటంతో అందరి చూపు ఈ ఈవెంట్‌పైనే పడింది. పైగా ఇందులో అభిజిత్, అభిజిత్ తల్లి ఇలా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉండబోతోన్నట్టున్నాయి.
సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!
షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!