Saturday, April 20, 2024
- Advertisement -

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

- Advertisement -

సినిమాల్లో అవకాశల కోసం ఎంతో మంది ఎదురుస్తుంటారు. కొందరికి టాలెంట్ ఉన్న అవకాశలు రాక ఇబ్బంది పడుతుంటారు. టాలెంట్ లేకున్న సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకు అవకాశాలు మొండుగా ఉంటాయి. ఇండస్ట్రీ కొత్తగా రావాలంటే అప్పట్లో సెలక్షన్స్.. ఆడిషన్స్.. అంటు ఆఫీస్‍ల చూట్టు తీరగాల్సి వచ్చేది. ఇప్పడు సోషల్ మీడియా వచ్చాక పరిస్థితులు మారాయి. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్లో వీడియోల ద్వారా పాపులర్ అయినవాళ్లు చాల మందే ఉన్నారు. అలగే షాట్ వీడియో ప్లాట్‌ఫాం ద్వారా పాపులర్ అయినవాళ్లు కూడా ఉన్నారు. అలా పాపులర్ అయిన వారికి సినిమాల్లో, రియాలిటీ షోలలో మరియు కామెడీ షోలలో అవకాశాలు దక్కుతున్నాయి. అలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నా వాళ్ళెవరెవరో ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ : కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలిం ద్వారానే తన కెరియర్ ను మొదలుపెట్టాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి వచ్చారు. తర్వతా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలసి నటించారు. 2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్ళి చూపులు సినిమా తో హీరోగా పరిచయం అయ్యారు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
రాజ్ తరుణ్ : 52 షార్ట్ ఫిలిమ్స్ లలో నటించిన రాజ్ తరుణ్ 2013లో ఉయ్యాల జంపాల సినిమా తో హీరోగా పరిచయం అయ్యారు.
విశ్వక్ సేన్ : పిట్ట కథ అనే షార్ట్ ఫిలింతో కెరియర్ ను మొదలు పెట్టి హీరోగా ప్రస్తుతం వరుస హిట్లు అందుకుంటు ముందుకు దూసుకుపోతున్నాడు.
విజయ్ సేతుపతి : షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ను మొదలుపెట్టి తమిళంలో స్టార్ హీరోగా ఎదిగారు.

సుహాస్ : ఇతని కెరియర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలయ్యింది. ఈ మధ్యనే కలర్ ఫోటో సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతీరోజూ పండగే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాల్లో నటించాడు.
రాహుల్ రామకృష్ణ : సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి.. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, గీత గోవిందం, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసాడు.
వైవా హర్ష: వైవా అనే స్పూఫ్ విడియో తోనే హర్ష కాస్త వైవా హర్షగా మారాడు.. అలా ఇతను కూడా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఎన్నో స్పూఫ్ వీడియోలు చేసేవాడు. తరువాత కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. గోవిందుడు అందరివాడేలే, దోచేయ్, కృష్ణ అండ్ హిజ్ లీల, కలర్ ఫోటో సినిమాల్లో నటించాడు.

పూజిత పొన్నాడ : అనుకోకుండా అనే షార్ట్ ఫిలింతో కెరియర్ మొదలు పెట్టి రంగస్థలం, కల్కి, బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
రీతు వర్మ : అనుకోకుండా షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు సినిమాలతో ఫేమస్ అయింది.
చాందినీ చౌదరి : ఈమే కెరియర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ తో మొదలైంది. మధురం షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపు తెచ్చుకొని బ్రహ్మోత్సవం, శమంతకమణి, మను, కలర్ ఫోటో సినిమాల్లో నటించింది.
ప్రియాంక జవాల్కర్: ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ అనే షార్ట్ ఫిలింతో కెరియర్ ను మొదలు పెట్టిన ఈ అమ్మడు ట్యాక్సీ వాలా సినిమాతో ఫేమస్ అయింది. ఇప్పడు ఎస్ఆర్‍కల్యాణ మండపం సినిమాలో నటిస్తుంది.

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -