Wednesday, May 15, 2024
- Advertisement -

నాని కోపంగా తిడుతున్నారు- యాంక‌ర్ శ్యామల

- Advertisement -

యాంక‌ర్ శ్యామల బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.అయితే ఇప్ప‌టికి వ‌ర‌కు ఎలిమినేట్ అయిన వారికి మళ్ళీ వెన‌క్కి వచ్చే అవ‌కాశం క‌ల్పించింది బిగ్‌బాస్‌.దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయిన వారు సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చి వారికి ఓట్లు వేయాల‌ని అభిమానుల‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.దీనిలో భాగంగానే యాంక‌ర్ శ్యామ‌లా త‌న ఫేస్‌బుక్ లైవ్‌లోకి వ‌చ్చి త‌నకు ఓట్లు వేయాల‌ని కోరింది.ఇక శ్యామ‌ల అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది.

ఓ అభిమాని నుండి షోకి నాని హోస్టింగ్ ఎలా ఉందనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.దీనిపై శ్యామ‌ల స్పందిస్తు… “ఎన్టీఆర్ .. నానీలను ఒకరితో ఒకరిని పోల్చలేం .. ఎవరి స్టైల్ వారిది. నానికి నాచురల్ స్టార్ అనే పేరుంది .. ఆయన యాంకరింగ్ కూడా చాలా నాచురల్ గానే వుంది. నానికి కోపం వస్తే తిడుతున్నారు ,నచ్చితే మెచ్చుకుంటున్నారు అంటూ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -