Saturday, May 4, 2024
- Advertisement -

ప్ర‌మాదాన్ని ముందే ఊహించి.. వెన‌క్కు త‌గ్గిన జ‌న‌సేనాని

- Advertisement -

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లో ఆరితేరిన‌ట్టే క‌నిపిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ త‌న‌పై చేసిన వ్య‌క్తిగత ధూష‌ణ‌ల‌కు అంతే ధీటుగా స‌మాధాన‌మిచ్చిన ప‌వ‌న్‌.. వివాదం పెద్ద‌ద‌వ్వ‌కుండా ఇప్పుడు దెబ్బ‌కు మందు పూసే పనిని చేప‌ట్టారు. భ‌విష్య‌త్తులో త‌న‌కు ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైతే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ప్ర‌మాదాన్ని ముందే ఊహించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెన‌క్కు త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న మూడు పెళ్లిళ్ల గురించి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డంతో.. ప‌వ‌న్ ఘాటుగా స్పందించారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే.. ఉప్పెన‌లా దాడి చేసి.. తోలు తీస్తామంటూ జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్యాక్ష‌న్ గుండాలు నోటికొచ్చిన‌ట్టు మాట్టాడితే చూస్తూ ఊరుకోమ‌ని ఉప్పెన‌లా దాడి చేసి.. ముంచేస్తామ‌న్నారు. తాను కూడా అలాంటి వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌లు, దిగ‌జారుడు భాష‌ను వినియోగిస్తే.. ఫ్యాక్ష‌నిస్టు నాయ‌కులు త‌ట్టుకోలేక‌.. ప‌రుగులు పెట్టాల్సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ తీవ్ర ఆగ్ర‌హంతో స‌మాధానం ఇచ్చారు. చూడ్డానికే తాను మెత్తగా కనిపిస్తా.. తేడా వస్తే తోలు తీస్తా అంటూ జ‌గ‌న్‌ను నేరుగానే ప‌వ‌న్ హెచ్చ‌రించారు. జ‌గ‌న్ మాట్లాడిన మాట‌లే ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే.. ప‌వ‌న్ అంత‌కు ప‌దింత‌లు హీటు పుట్టించే మాట‌ల‌ను జ‌గ‌న్ మీద‌కు వ‌దిలారు. దీంతో ఈ వివాదం ఇక్క‌డితో ఆగ‌ద‌ని.. ఎంత‌వ‌ర‌కైనా దారితీయొచ్చ‌ని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా ప‌వ‌న్ ఈ రోజు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వివాదానికి ముగింపు ప‌లికేందుకు నిన్న జ‌గ‌న్ విష‌యంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు మందు పూసే ప‌నిని తాజాగా ఆరంభించారు.
వైఎస్ జ‌గ‌న్ త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా ధూషించ‌డం ఎంతో బాధించిందంటూ ట్విట‌ర్‌లో విడుద‌ల చేసిన నోట్‌లో ప‌వ‌న్ పేర్కొన్నారు. త‌న‌ను ఒక్క‌డినే కాకుండా.. ఆ మాట‌లు ఎంతో మందిని బాధపెట్టాయ‌న్నారు. ప‌వ‌న్ లేఖ‌లో జ‌గ‌న్‌కు మందుపూసిన విధాన‌మిదీ.. జగన్‌ గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించింది. కొంద‌రు నా దృష్టికి ఈ విష‌యం తీసుకొచ్చారు. నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనికి వెళ్లే వ్య‌క్తిని కాదు. కేవలం రాజకీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను. ప్రజలకి సంబంధించిన విధానాల మీదే ఇతర పార్టీలతో విభేదిస్తాను. ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు పెట్టుకోను. అందుకే.. జ‌గ‌న్ నాపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఎవ‌రూ బాధ‌ప‌డొద్దని నా మ‌న‌వి. ఆవేశ‌ప‌డొద్దు. ఎవ‌రూ జగన్‌ను కానీ ఆయనకు సంబంధించిన కుటుం సభ్యులను వివాదంలోనికి లాగొద్దు. జ‌గ‌న్ ఇంటి ఆడపడుచులను ఈ వివాదంలోకి లాగొద్ద‌ని అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి ఈ వివాదాన్ని అందరూ ఇక్కడితో ఆపేయాలని కోరుకుంటున్నాను.. అంటూ వ‌ప‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ప‌వ‌న్‌కు ఈ వివాదాన్ని పొడిగించ‌డం ఇష్టం లేద‌ని ఈ లేఖ ద్వారా అర్థ‌మైంది. భ‌విష్య‌త్తులో త‌న మూడు పెళ్లిల్ల విష‌యం ఎవ‌రు తెర‌పైకి తెచ్చినా.. ప‌వ‌న్ ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. అందుకే.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు ధీటుగా నిన్న స్పందించారు. మ‌ళ్లీ ఎవ‌రూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉండాల‌నే ధోర‌ణిలో ప‌వ‌న్ స్పంద‌న క‌నిపించింది. అయితే.. ఈ వివాదం ఎంత పెరిగితే.. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాలపై అంత ర‌చ్చ జ‌రుగుతుంది. ఇంక ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాన్ని అత్యంత తేలిక‌గా కామెంట్ చేసే అవ‌కాశం ఉంది. ఇది ప‌వ‌న్ రాజ‌కీయ‌, సినీ జీవితానికి ఎట్టిప‌రిస్థితుల్లోనూ మంచిది కాదు. అందుకే ఈ రోజు.. దెబ్బ‌కు మందుపూసే ధోర‌ణిని ప‌వ‌న్ చేప‌ట్టారు. జ‌గ‌న్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్ద‌ని.. ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. అదికూడా వేడుకుంటున్నానంటూ అన‌డం గ‌మ‌నార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -