Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్ -3 సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా ఉద‌య‌భాను..రోజుకి ఎంతో తెలుసా..?

- Advertisement -

ఒక‌ప్పుడు బుల్లితెర మీద యాంక‌ర్‌గా ఓ వెలుగు వెలిగింది ఉద‌య‌భాను. అప్ప‌ట్లో ఏ ఛానెల్లో చూసిన ఉద‌య‌భానునే క‌నిపించేది. కాని పెళ్లి చేసుకున్న త‌రువాత కొంత గ్యాప్ తీసుకుంది ఉద‌య‌భాను. ఈలోపు కొత్త‌గా వ‌చ్చిన యాంక‌ర్లు త‌మ హవాను చూపించడంతో ఉద‌య‌భాను రీఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి పెద్ద‌గా ఉప‌యోగం లేక‌పోయింది. తాజాగా మ‌రోసారి ఉద‌య‌భాను పేరు వార్త‌ల్లో నిలిచింది.

మొట్ట‌మొద‌టి తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ మూడు సీజ‌న్‌కు స‌ర్వం స‌న్న‌ద్దం అవుతోంది. హోస్ట్‌గా ఎవ‌రు వ‌స్తారనే దానిపై క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌టికి , కంటెస్టెంట్ల విష‌యంలో బిగ్‌బాస్ యాజ‌మాన్యం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి కాస్తా క్రేజ్ ఉన్న న‌టీన‌టుల‌తో పాటు యాంకర్స్‌ని కూడా తీసుకునే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌ బిగ్‌బాస్. దీనిలో భాగంగానే ఉద‌య‌భానుని సంప్ర‌దించింద‌ట బిగ్‌బాస్ యాజ‌మాన్యం. దీనిపై ఉద‌య‌భాను కూడా సానుకూలంగానే స్పందించిన‌ట్లు స‌మాచారం.

ఎలిమినేట్ అయ్యేంతవరకూ రోజుకి 2 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పి నిర్వాహకులు ఆమెను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సీజ‌న్‌లో ఉద‌య‌భానుకే ఎక్కువ పారితోష‌కం ఇచ్చి తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో ఉద‌య‌భానుని తీసుకున్నారా లేదా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -