- Advertisement -

వేశ్య గా మారిన హీరోయిన్

- Advertisement -

సౌత్ లో సూపర్ మోడల్ గా క్రేజ్ సంపాదించిన ఆండ్రియా సినిమాల్లో కూడా అదరగొడుతుంది. విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాల్లో కమల్ సరసన నటించిన ఆండ్రియా తెలుగులో తఢాకా సినిమాలో సునీల్ కు జోడీగా నటించింది. అయితే కెరియర్ అంత సక్సెస్ఫుల్ గా లేని ఆండ్రియా ఇప్పుడు వేశ్యగా మారుతుందట. ఆగండాగండి నిజంగానే అనుకునేరు ఓ సినిమా కోసం ఆమె వేశ్య పాత్రలో కనిపిస్తుందట.

అది ఎవరి సినిమానో కాదు కోలీవుడ్ మ్యాన్లీ స్టార్ ధనుష్ సినిమాలోనే అట. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేయబోతున్న సినిమా ‘వడ చెన్నై’. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ వేశ్య పాత్ర చాలా ప్రాముఖ్య ఉందట. అయితే ఆ పాత్రకు ఆండ్రియాను సెలెక్ట్ చేసి రీసెంట్ గా స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట.

ఇందులో ఉత్తర చెన్నై వాసులుగా ధనుష్, సమంత నటిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఇందులో హీరో హీరోయిన్ మేకప్ లేకుండానే నటిస్తున్నారట. ఇంకా చెప్పాలంటే సమంత దీ గ్లామరస్ గా కనిపిస్తుందట. ప్రస్తుతం కొడి సినిమా చేస్తున్న ధనుష్ అది పూర్తి చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -