Thursday, May 16, 2024
- Advertisement -

కాజల్ ముద్దు గోల

- Advertisement -

సౌత్ క్రేజీ హీరోయిన్ కాజల్ ఎన్నడు లేనిది రణదీప్ హుడాతో చేస్తున్న బాలీవుడ్ సినిమాలో లిప్ లాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించినా కనీసం ఓ రేంజ్ దాటి స్కిన్ షో కూడా చేయని కాజల్ బీ టౌన్ లో ఏకంగా ముద్దు సీన్లో నటించడం ఏంటని అందరు షాక్ అయ్యారు.

అయితే అది కావాలని చేసింది కాదని.. సీన్ డిమాండ్ చేస్తే అలా కానిచ్చేశాం అని అంటుంది అమ్మడు. ఎంత సీన్ డిమాండ్ చేసినా ఇన్నాళ్లు చేయని లిప్ లాక్ ఎలా చేసిందంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.అయితే స్టోరీ చెప్పినప్పుడు అందులో లిప్ లాక్ గురించి మాట్లాడలేదని.. షూట్లో లిప్ లాక్ జరిగే సరికి తాను కూడా అవాక్కయ్యానని స్వయంగా కాజలే చెప్పడం విశేషం.

మరి కావాలని పెట్టి ఇలా మాట్లాడుతుందో లేక నిజంగానే అలా జరిగిందో తెలియదు కాని.. దో లబ్వోంకీ క‌హానీ సినిమాలో కాజల్ లిప్ లాక్ చూసేయొచ్చు. కెరియర్ ముగిస్తుంది అనుకున్న సమయంలో అమ్మడు ఇలా లిప్ లాకులు గంట్రా చేసి మరిన్ని అవకాశాలు సంపాదించాలనే ప్లాన్ చేస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాజల్ లిప్ అంటే బాలీవుడ్ లోనే కాదు సౌత్ ప్రేక్షకుల్లో కూడా ఓ క్యూరియాసిటీ ఉంది. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -