Saturday, April 27, 2024
- Advertisement -

అనిల్‌తో మరోసారి వెంకీ..ఫ్యాన్స్‌కు పండగే!

- Advertisement -

అనిల్ రావిపూడి..వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్. ముఖ్యంగా కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారారు. ముఖ్యంగా పటాస్, ఎఫ్ 2,ఎఫ్‌ 3 వంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేశారు. జంధ్యాల,రేలంగి,ఈవీవీ తర్వాత కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.

తాజాగా అనిల్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఎఫ్ 2,ఎఫ్ 3 తర్వాత మరోసారి వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నారు అనిల్. ఈ ప్రాజెక్టుని స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా అనిల్ – దిల్ రాజు కాంబోలో డబుల్ హ్యాట్రిక్ మూవీ.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్ హిట్‌లుగా నిలిచాయి. సైంధవ్‌తో నిరాశ పర్చిన వెంకి.. అనిల్‌తో సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -