Tuesday, April 30, 2024
- Advertisement -

విశ్వంభర కోసం చెమట చిందిస్తున్న చిరు!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. శివశక్తి దత్తా, చంద్రబోస్లిరిక్ రైటర్స్. శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా వ్యవహరిస్తుండగా 2024 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల నుండి చిరు సినిమా షూటింగ్‌లో జాయిన్ కానుండగా ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. విశ్వంభర కోసం జీమ్‌లో తెగ కష్టపడుతున్నారు చిరు.

చిరు చెమటలు చిందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీడియో చివరలో ‘గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర అని చిరు చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తునారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -