- Advertisement -

భల్లాల దేవ కొత్త సినిమా

- Advertisement -

బాహుబలి సినిమా లో ప్రతినాయకుడి పాత్ర లో అద్భుతంగా నటించిన రానా మంచి గుర్తింపు తెచుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రానా బాహుబలి 2  మరియు ‘ఘాజీ’ వంటి రెండు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తరువాత రానా హీరోగా ఓ సినిమా ఓప్పుకున్నాడు.

ఐతే గత సంవత్సరం మంచి ఫీల్‍గుడ్ మూవీ అనిపించుకొన్న చిత్రం ‘అలా ఎలా’. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం  వహించాడు. మంచి హిట్ అవ్వడంతో ఈ దర్శకుడికి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు ఇప్పటి వరకు మళ్ళీ సినిమా మొదలు పెట్టలేదు.

తాజా సమాచరం ప్రకారం తన రెండో సినిమాని భల్లాల దేవతో చేయబోతున్నాడట. రీసెంట్‍గా రానాకి ఓ కథ చెప్పడట ఈ దర్శకుడు. రానాకు కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాలు కాంప్లీట్ చేసాకా అనిష్ దర్శకత్వంలో చేయనున్నాడట.

మరి హీరోగా రానాకి ఈ సినిమా ఏలాంటి విజయం ఇస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -