Saturday, May 11, 2024
- Advertisement -

పగలు,రాత్రి కష్టపడి కోన్న కారు

- Advertisement -
Anjali gifts herself a BMW Car

హీరోయిన్ అంజలి ఈ మధ్య కొత్త కారు కొన్నది. ఖరీదైన ఈ స్కోడా కారు ఆమె బహుమతిగా అందుకున్నదని పరిశ్రమలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ కొనిచ్చారని కొందరు, ప్రముఖ రచయిత ఇచ్చారని మరికొందరు చెప్పుకొచ్చారు.

అయితే అంజలి మాత్రం ఈ పుకార్లను తోసిపుచ్చుతున్నారు. కారు కూడా కొనుక్కునే స్థితిలో నేను లేనా అని ఆమె ప్రశ్నించింది. పగలు,రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంది నచ్చింది కొనుక్కోవడానికే కదా అని అంజలి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఎవరో గిఫ్ట్ ఇచ్చారన్న వార్తలు బాగా బాధకల్గించాయని ఆమె అన్నారు. సమయం లేక డిక్టేటర్ సినిమా పగలు, సరైనోడు రాత్రి చేశానని,42 గంటల పాటు నిద్ర పోకుండా కష్టపడి షూటింగ్ లో పాల్గొన్నానని అంజలి చెప్పుకొచ్చారు.

చిత్రాందగ సినిమా కోసం అమెరికాలో మైనస్ 11 డిగ్రీ చలి ఉన్నప్పటికి ఎన్నో ప్రయాసలకోర్చి షూటింగ్ చేశానని ఆమె అన్నారు ఇంత కష్టపడి డబ్బులు సంపాదించుకొని కారు కొనుక్కుంటే ఆ కష్టం తనది కాదని చెప్పడం ఎంత వరకు న్యాయం అంజలి ప్రశ్నిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -