Tuesday, May 21, 2024
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

- Advertisement -
How Many Ways to reach Tirumala

తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి ఎన్ని మార్గాలు ఉండడం ఏంటి.. అలిపిరి ఒక్కటేగా ఉంది అని అనుకుంటున్నారు కదూ. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శ్రీవారి ఆలయానికి చేరుకోడానికి మొత్తం8 మార్గాలున్నాయి. కానీ సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఇక ఆ ఎనిమిది మార్గాల గురించి తెలుసుకుందాం.

అన్ని మార్గాల్లో మొదటిది ముఖ్యమైనది అలిపిరి. ఇక రెండవది..  తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. ఈ మార్గం గుండా ప్రయాణిస్తే పట్టే సమయం గంట. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. 

ఇక మూడవ మార్గం.. మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యానంలో ఉంది.  విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు. ఇక నాల్గవ దారి తిరుమల కొండకు పశ్చిమం వైపున ఉన్న కళ్యాణి డ్యాం … దానికి ఆనుకొని ఉన్న శ్యామలకోన  దారిలో 15 KM  కిలీమీటర్లు ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వచ్చేస్తుంది.  

ఇక ఐదవ దారి కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం ద్వారా పాపవినాశనం, ఆ తర్వాత తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM. ఇక ఆరవ దారి అవ్వాచారి కొండ.రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. ఇక ఏడవ  దారి ఏనుగుల దారి.

 చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు. ఇక ఎనిమిదవ దారి తలకోన నుండి ఉంది.  జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే … మీరు తిరుమలకు చేరుకున్నట్లే. ఈ మార్గాన 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 

 {youtube}v=W18HE5TG1Dg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -