మెగా బ్రదర్ నాగబాబుకు మెగా హీరోలు కలిసి రావడం లేదు.తన కుటుంబం అన్నదమ్ములు హీరోలు అయిన తను మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు.తండ్రి, మామ, బాబాయి ఇలా రకరకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. జబర్ధస్త్ లాంటి టీవీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కానీ ఒక్క విషయంలో మాత్రం నిరాశకు గురౌతున్నారు. నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు.నాగాబాబు నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి సినిమాలు సైతం ప్లాప్ అయ్యాయి.ఇక ఎంత ఆశలు పెట్టుకున్న రాంచరణ్ ఆరెంజ్ సినిమా పైతం దారుణంగా ఫెయిల్ అవ్వడంతో అప్పుల ఊబిలో కురుకుపోయాడు నాగబాబు.
దీంతో ఆత్మహత్యకు సైతం పాల్పడ్డానని స్వయంగా నాగబాబే వెల్లడించాడు నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను ముగ్గురు నిర్మాతలతో కలిసి నిర్మించారు.ఈ రోజే(శుక్రవారం) సినిమా రీలిజ్ అయింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది.ఈ సినిమా టాక్ యావరేజ్ అని వినపడుతోంది.. ఈ లెక్కన మరోసారి నాగబాబు కష్టాల్లో పడినట్టేనా అనే వాదనలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా మెగా హీరోల సినిమాలు నాగబాబుకి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.
ALSO READ: ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైన బన్నీ నా పేరు సూర్య మూవీ