Wednesday, April 24, 2024
- Advertisement -

సుకుమార్ ని ఇలా రిజెక్ట్ చేస్తున్నారేంటి.. మరో హీరో కూడా..?

- Advertisement -

సుకుమార్ సినిమాలు ఎంత ఇంటలెక్చువల్ గా ఉంటాయి అందరికి తెలిసిందే.. కొంతైనా తెలివి లేకపోతే సుకుమార్ సినిమాలు పెద్దగా అర్థం కావు.. తన మొదటి సినిమా నుంచి ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. ముఖ్యంగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా లో సుకుమార్ ఇంటలిజెన్స్ మనం చూడొచ్చు.. టాప్ హీరోలతో సైతం ప్రయోగాత్మక సినిమాలు చేయడం ఒక్క సుకుమార్ కె చెల్లింది.

ఇక ఇటీవలే రంగస్థలం సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు.. మహేష్ తో అనౌన్స్ చేసిన సినిమా సడెన్ గా ఆగిపోయింది.. దాంతో అప్పటికప్పుడు అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ని మొదలుపెట్టాడు..  ఆ సినిమా అయినా షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటుందా అంటే అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. ఇప్పటికే కాపీ రైట్ మరక పడి సుకుమార్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది.. ఆ తర్వాత కరోనా వల్ల షూటింగ్  వాయిదా పాడడం సుకుమార్ కి పెద్ద తలనొప్పిగా తయారైంది.. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో ఇటీవలే మొదలైంది..

అయితేఈ చిత్రానికి ఇంకా విలన్‍ ఎవరనేది ఫిక్సవలేదు. మొదట విజయ్‍ సేతుపతి అనుకున్నారు కానీ లాక్‍డౌన్‍ టైమ్‍లో తనకు డేట్స్ కుదరవని అతను తప్పుకున్నాడు. దాంతో నారా రోహిత్‍ను సంప్రదించారు కానీ హీరోగా మరోసారి అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలలో వున్న అతను సమ్మతం తెలుపలేదు. ఆ తర్వాత తమిళ హీరో మాధవన్‍ ఇందులో విలన్‍గా నటిస్తున్నాడంటూ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. కానీ అతను కూడా ఈ సినిమా కి నో చెప్పినట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ సినిమా లో విలన్ గా నటించే ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -