Saturday, May 11, 2024
- Advertisement -

జగన్ కంటే బాబు హయంలోనే ఎక్కువ దాడులు..?

- Advertisement -

రాష్ట్రంలో గత కొన్ని రోజులు గ జరుగుతున్న పరిణామాలను అందరు గమనిస్తూనే ఉన్నారు.ఒక సమస్య ముగిసిపోయిందనుకునేలోపు మరొక సమస్య ముందుకు వచ్చి అందరి ఓపికను పరిష్కరిస్తుంది.. ముఖ్యంగా జగన్ అధికారం లోకి వచ్చిన దగ్గరినుంచి సమస్యల వలయం చుట్టుముట్టుతుందని చెప్పొచ్చు..  ఇప్పటికే రాజకీయంగా చాల సమస్యలు ఉన్నాయి.. అవి చాలవన్నట్లు కొత్తగా దేవాలయాల సమస్య సైతం అధికారం ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి.. ఇప్పటికే అందుతర్వేది రథం దగ్ధం విషయం ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనంగా మారింది.. అంతేకాకుండా దుర్గగుడి లో సింహపు ప్రతిమల చోరీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య గా మారిపోయింది.

ప్రతిపక్షాలు అయితే వైసీపీ ప్రభుత్వమే అవి చేయించినట్లు హడావుడి చేసే ప్రయత్నం చేసింది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఈ తరహా దాడులు జరగలేదన్నట్లు, వైసీపీ ని విలన్ గా చూపించే ప్రయత్నాలు చేసి చివరకి విఫలమయ్యింది.. జగన్ పై నమ్మకం తో ఇంత పెద్ద విజయాన్ని అప్పజెప్పిన ప్రజలు జగన్ అలా చేసి ఉంటాడంటే ఎవరు నమ్మలేదు.. సిబిఐ విచారణ వేసిన నేపత్యంలో ఈ విషయంలో ఏది తప్పు ఏది రైట్ అనేది త్వరలో తేలనుంది.. ఇక ఆలయాలపై దాడుల విషయంలో ప్రతిపక్షాలు నోరేసుకుతున్నాయి కనుక టీడీపీ హయాంలో , కాంగ్రెస్ హయాంలో ఎన్నెన్ని దాడులు జరిగాయో ఇప్పుడు చూద్దాం..

అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర విభజన తరువాత ఈ ఏడాదే ఆలయాలపై దాడులు తక్కువగా జరిగాయని డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు..  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆలయాలపై దాడులు ఎక్కువగా జరిగాయని కూడా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ఆయా పార్టీల నాయకులు ఏమంటారో..? ఆలయాల పై దాడుల గణాంకాలు పరిశీలిస్తే టిడిపి అధికారంలో ఉన్న 2015లో 290, 2016లో 332, 2017లో 318, 2018లో 267 ఆలయాలపై దాడులు జరిగాయి. 2019లో 319, ఈ ఏడాది ఇప్పటి వరకు 228 దాడులు జరిగాయి. అయితే అంతర్వేది రథం దగ్ధం, విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని రథానికి సంబంధించిన వెండి సింహాసనం చోరీ, రాష్ట్రంలో ఇతర ఆలయాలపై దాడులు ఇటీవల కాలంలో రాజకీయంగా దుమారం లేపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -