Tuesday, May 21, 2024
- Advertisement -

మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు!

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేశ్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అంతకన్నా ముందు మహేశ్ అన్న రమేశ్ హీరోగా నటించి సక్సెస్ కాలేకపోయాడు. మహేశ్ మాత్రం ఇండస్ట్రీఏకే వరంగా మారాడు. మరి ఈ కుటుంబం నుంచి ఆ తర్వాత సుధీర్ బాబు వచ్చాడు.

కృష్ణకు మేనల్లుడిగా.. మహేశ్ బాబుకు బావగా సుధీర్ బాబు ఇండస్ట్రీలో పోరాడుతున్నాడు. అయితే ఇతడికి  సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు.

అయితే తన ప్రయత్నాలను తాను చేస్తున్నాడాయన. ఇక ఇటీవలే మహేశ్ బాబు తనయుడు గౌతమ్ కూడా ‘వన్’ సినిమాతో పరిచయం అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆరంగ్రేటం చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే ఇంటి నుంచినే మరో హీరో రానున్నాడట. సుధీర్ బాబు తనయుడు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సుధీర్ బాబే ధ్రువీకరించాడు.

తన తనయుడు చర్విత్ మానస్ కు సినమాలు అంటే చాలా ఇంట్రస్టు ఉందని.. బహుశా మేనమామ మహేశ్ బాబు స్ఫూర్తితో వాడికి సినిమాల మీద ఆసక్తి కలిగిందేమో అంటూ సుధీర్ బాబు వ్యాఖ్యానించాడు. తనకు నటుడు కావాలనే ఫ్యాషన్ ఉందని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. మరి ఈ మాటలను బట్టి చూస్తే సుధీర్ బాబు తనయుడు సినిమాల్లోకి రానున్నాడని కన్ఫర్మ్ అవుతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -