Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ కటాక్షం కోసం మరో హీరో ఎదురుచూపు!

- Advertisement -

ఈ మద్య నిఖిల్ పరిస్థితి బాగానే ఉంది. ప్రత్యేకించి ‘స్వామిరారా’ సినిమా దగ్గర్నుంచి అతడి పరిస్థితి చాలా బాగుంది. వరస హిట్లు దక్కుతున్నాయి. కార్తికేయ, సూర్యా వర్సెస్ సూర్యా సినిమా హిట్స్ గా నిలవడంతో ఇప్పుడు అతడి తర్వాతి సినిమా ‘శంకరాభరణం’ కూడా ఆశాజనకమైన పొజిషన్ లో నిలుస్తోంది.

కోనవెంకట్ ప్రొడ్యూసర్ కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి జనరేట్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతానికి అయితే టీజర్ ను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

విశేషం ఏమిటంటే.. ఈ టీజర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించాలనేది ఈ సినిమా యూనిట్ ప్రయత్నమట. అందుకోసం వారు ట్రై చేస్తున్నారు. తమ సినిమా టీజర్ ను పవన్ విడుదల చేస్తే దానికి మంచి పబ్లిసిటీ వస్తుందని వారు భావిస్తున్నారు. ఈసినిమా రూపొందండంలో కీలక పాత్ర పోషిస్తున్న కోన వెంకట్ కు పవన్ కల్యాణ్ సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో పవన్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశాలే ఎక్కువ. మరి అదే జరిగితే “శంకరాభరణం’ సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందనే చెప్పాలి. మరి పవన్ కటాక్షం కచ్చితంగా లభిస్తుందో లేదో అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -