Friday, May 3, 2024
- Advertisement -

పెద్ద తలనొప్పి పోయింది – చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

ఏపీ మంత్రి వర్గ సమావేశం చాలా ఆసక్తికరంగా సాగింది, చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ విషయాలు అన్నీ మీడియా కి వెల్లడించారు. కాబినెట్ భేటీ లో చర్చించి పలు ఇంపార్టెంట్ నిర్ణయాలతో పాటు చిన్న చిన్న పనికొచ్చే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయం లో క్షుణ్ణంగా చర్చ సాగింది అని బాబు తెలిపారు. పోలవరం ముంపు మండలాను ఎన్డీయే ప్రభుత్వం ఏపీ లో కలపడం వల్ల పెద్ద తలనొప్పి తొలగిపోయింది అని అన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టు ద్వారా 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అయితే… కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లనే పోలవరం ప్రాజెక్టు చేపట్టడంలో కాలయాపన జరిగిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు గుత్తేదార్లకు రూ 241.822 కోట్లు చెల్లించారని చెప్పారు. ఇరిగేషన్ హైడ్రో పవర్ సాగునీటి , తాగునీటి వసతులకి ఉపయోగపడుతుంది అని, భూసేకరణ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురుకున్నాం అని అన్నారు ఆయన. 

భూమి కోల్పోయిన రైతుల కి నష్టపరిహారం అందించాము అని పోలవరం ప్రాజెక్టు విషయం లో ఎప్పటికప్పుడు కేంద్రం వద్దకి స్పెషల్ టీం వెళ్లి మరీ నివేదిక అందిస్తోంది అని ప్రకటించారు. కీలకమైన రాజధాని నిర్మాణం లో ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం భాగస్వామ్యులు కావాలి అని ఆయన పిలుపుని ఇచ్చారు. దేశం లోనే పవిత్రమైన రోజు విజయదశమి అని అందుకే ఆ రోజున శంకుస్థాపన చేస్తున్నాము అని ఆయన తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -