Friday, April 19, 2024
- Advertisement -

పుష్ప2 లో మెయిన్ విలన్ ” షెకావత్ ” కాదా ?

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన గత చిత్రం ” పుష్ప “. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళంలో కూడా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ముఖ్యంగా హిందీలో ఊహించని విధంగా విజయం సాధించి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. దాంతో పుష్ప పార్ట్ 1 ను కొనసాగింపుగా రాబోతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరబాద్ లో ప్రారంభం అయింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

అయితే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ విలన్ పాత్రను సుకుమార్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ విలన్ పాత్ర సినిమాలో చాలా కీలకం కానుందట.. అందుకే ఈ పాత్రపై సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పాత్ర కోసం ఆది పినశెట్టి పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ నటించిన ” సరైనోడు ” మూవీ లో ఆది పినశెట్టి విలన్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. దాంతో పుష్ప పార్ట్ 2 లో కూడా అల్లు అర్జున్ కు ధీటైన పాత్రలో ఆది పినశెట్టి కనిపించబోతున్నట్లు సమాచారం.

అయితే పుష్ప మొదటి భాగంలో సునిల్, అజయ్ ఘోష్, అజయ్, ఫహద్ ఫజిల్ వంటి వారు విలన్లు గా కనిపించారు. అయితే మెయిన్ విలన్ గా ఫహద్ ఫజిల్ పాత్ర మొదటి బాగంలో తక్కువే ఉన్నప్పటికి రెండవ భాగంలో ఫహద్ పాత్రనే అధికభాగం ఉంటుందని ఆ మద్య చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆది పినశెట్టి పాత్ర మెయిన్ విలనా లేక ఫహద్ ఫజిల్ పోసించిన షెకావత్ పాత్ర మెయిన్ విలనా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆది పినశెట్టి విలన్ పాత్రకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికి.. ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -