Wednesday, April 24, 2024
- Advertisement -

టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

- Advertisement -

గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే చంద్రబాబు ఎన్డీయే బలపరిచిన అభ్యర్థులకు మద్దతు కూడా తెలిపారు. ఆ తరువాత ప్రధాని మోడీ చంద్రబాబుతో భేటీ కావడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ మళ్ళీ బీజేపీతో చేతులు కలుపబోతుందా ? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపించాయి. అయితే ఆ మద్య టీడీపీ తో ఎలాంటి పొత్తు ఉండబోదని ఏపీ కమలనాథులు చెప్పినప్పటికి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే పొత్తుపై ఇరు పార్టీలు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. .

ఇక తాజాగా అమిత్ షా తో నారా లోకేశ్ కూడా భేటీ అయినట్లు వార్తలు వచ్చినప్పటికి దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. ఏది ఏమైనప్పటికి టీడీపీ మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పోటీచేసిన టీడీపీ అప్పుడు అధికారం దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చింది టీడీపీ.. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసింది. దాంతో ఈ సారి 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీయే తో చేతులు కలిపి తిరిగి ఏపీ అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే టీడీపీ తిరిగి ఎన్డీయేలో చేరడం వల్ల ఎవరికి లాభం అనే దానిపై విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ ఎన్డీయేలో చేరడం వల్ల తెలుగు దేశం కన్నా.. బీజేపీకే ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో బీజేపీ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అందువల్ల టీడీపీతో చేతులు కలపడం ఆ పార్టీ ఏపీలో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. అందుకే ప్రధాని మోడీ కూడా బాబుతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సక్యంగా ఉంటూ వస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. ఆ పార్టీని బీజేపీ పూర్తిగా దూరం పెట్టె అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల టీడీపీ ఎన్డీయేతో చేతులు కలపడం వల్ల బీజేపీకే అధిక లాభం చేకురానుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

కాంగ్రెస్ పార్టీ రాహుల్ వల్లే సర్వనాశనం అవుతోందా ?

పవన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

జగన్ మాస్టర్ ప్లాన్.. నిన్న కుప్పం నేడు మంగళగిరి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -