Saturday, May 4, 2024
- Advertisement -

ఆ సినిమాల వల్లే నా కెరీర్ ఇలా : అనూ ఇమ్మాన్యుయేల్

- Advertisement -

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. హీరోలైనా.. హీరోయిన్స్ అయినా సక్సెస్ లేకుంటే నిలబడటం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో తెలుగు తెరకు పరిచమైన అందమైన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. మొదటి సినిమా పర్వాలేదు అనిపించిన తర్వాత ఆమె స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ జోడీ కట్టి ఒక్కేసారి స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లేంది.

అయితే ఆమె చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి. తాజా ఆమె నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా పరాజయం పాలైంది. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిలో నిలవలేకపోయింది. దాంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ..” కెరియర్ తొలినాళ్లలో నాకు ఎలాంటి పాత్రలను ఎంచుకోవాలో తెలియలేదు.

నా పాత్ర వరకే విని కథ మొత్తం వినని సందర్భాలు వున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో పొరపాటు జరిగితే, మరికొన్ని ప్రాజెక్టులను వదులుకుని తప్పుచేశాను. ఇదంతా అనుభవలేమి వల్లనే జరిగింది. అందువల్లనే ఇప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -