Saturday, May 4, 2024
- Advertisement -

రెచ్చిపోతున్న అను ఇమ్మాన్యుయేల్

- Advertisement -

అను ఇమ్మాన్యుయేల్ వ‌రుస సినిమాల‌తో బిజి బిజిగా ఉంది. మ‌జ్ను సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అయింది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమాలో చాలా హోమ్లిగా క‌నిపించింది. ఈ సినిమాలో అనుని చూసిన‌వారు ఎవ‌రైనా ఈమె గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు స‌రిపోదు అని అనుకుంటారు. కాని ఆక్సిజన్, అజ్ఞాతవాసి సినిమాల్లో రెచ్చిపోయి అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది.ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయిన త‌న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు.ఇక బ‌న్నీ ప‌క్క‌న నా పేరు సూర్య సినిమాలో హీరోయిన్‌గా చేసింది.ఈ సినిమాలో గ్లామ‌ర్ డోస్ మ‌రింత పెంచింద‌ని టాక్.

ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అని అర్థం అవుతుంది. ఈ సినిమా త‌రువాత నాగ‌చైత‌న్య ప‌క్క‌న శైలజా రెడ్డి అల్లుడు చేస్తుంది. మాస్ రాజా ర‌వితేజ‌తో మ‌రో సినిమా చేస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ స్పీడ్ చూస్తుంటే టాప్ హీరోయిన్ అవ్వ‌ల‌ని టార్గెట్ పెట్టుకున్న‌ట్లుగా ఉంది.బ‌న్నీ సినిమా హిట్ అయితే పెద్ద హీరోల ప‌క్క‌న ఛాన్స్‌లు వ‌స్తాయ‌ని ఆశిస్తుంది. మ‌రి అను ఇమ్మాన్యుయేల్ క‌ల తీరుతుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -