Thursday, March 28, 2024
- Advertisement -

కొత్త లుక్‌లో క‌ల్యాణ్ రాం

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రాం గ‌త కొంత కాలంగా హిట్ కోసం ప్ర‌యత్నాలు చేస్తున్నాడు.మొన్న వ‌చ్చిన ఎమ్మేల్యే సినిమా ఫ‌ర్వాలేద‌ని అనిపించింది.క‌ల్యాణ్ త‌మ‌న్నా జంట‌గా నా నువ్వే సినిమా కొసం కొత్త లుక్ ట్రై చేశాడు. ఇప్ప‌డు అత‌ని కొత్త సినిమా కోసం మ‌రో లుక్‌లో ద‌ర్శ‌నం ఇచ్చాడు క‌ల్యాణ్ రాం. ఇటీవలే మొదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా కోసం మరొకసారి ఆయన తన స్టైల్‌ని మార్చారు.

ముంబయికి చెందిన ప్రముఖ స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ నేతృత్వంలోనే కల్యాణ్‌రామ్‌ కొత్త మేకోవర్‌ని సిద్ధం చేశారు. ఛాయా గ్రాహకుడు కె.వి.గుహన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఈ నెల 2 నుంచి మొదలు కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్‌, షాలిని పాండే న‌టిస్తున్నారు. క‌ల్యాణ్ రాం తాజా లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -