Tuesday, May 14, 2024
- Advertisement -

నన్ను కూడా వారు ఘోరంగా వేధించారు : అనుపమా పరమేశ్వరన్

- Advertisement -

అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ లో రానిస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని అనుపమా తెలిపింది. బస్సులో తను ఎదుర్కొన్న సంఘటనలను ఆమె వివరించారు.

“లైఫ్ లో ప్రతి అమ్మాయి ఒక్కసారైనా.. తనకు తెలియకుండానే లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. బస్సులో కండక్టర్ మహిళను తాకి వెళ్లొచ్చు. కానీ బస్సులో ఉన్న రద్దీ వల్ల దానిని మనం గుర్తించలేం. అలానే నా జీవితంలో కూడా చాలా సార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఉదాహరణకు బస్సులో ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్లినపుడు.. మాటలతో కూడా వేధిస్తూ ఉంటారు. తప్పుగా చూసినా కూడా అది వేధింపే. ఆ చూపులు మహిళలకు అర్థమవుతాయి. మీకు కూడా తల్లి, సోదరి ఉంటారు కదా.. అలా చేయడం ఆడవారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవాలి.

ఎప్పుడైన బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం బస్ ఎక్కి వచ్చే టైంలో లేడీస్ తక్కువ మంది ఉండేవారు. మగవారు దగ్గరకు వచ్చి నన్ను తాకేందుకు ప్రయత్నించేవారు. ఇలా చాలా సార్లు జరిగింది. ఎవరైనా అలా చేయడం చిరాకు తెప్పిస్తోంది. అలా చేయడం వల్ల వారికి కలిగే ఆనందం ఏంటో తెలియదు. నేనే కాదు చాలా మంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారు” అని ఆమె పెర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -