Thursday, May 16, 2024
- Advertisement -

రేవంత్ తో పాటు రెండు పార్టీల‌నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు….

- Advertisement -

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఖండువా క‌ప్పుకోని తెలంగాణాలో అధికార‌,టీడీపీకి షాక్ ఇస్తున్నారు. ఆయ‌న‌తో పాటు ఇరు పార్టీల‌నుంచి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికె టీడీపీనుంచి చాలామంది నాయ‌కులు రేవంత్‌తోపాటె న‌డుస్తుంటె ప‌నిలో ప‌నిగా అధికార పార్టీ టీఆర్ ఎస్‌నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌సలు మొద‌ల‌య్యాయి.

తెలంగాణాలోని 31 జిల్లాల అధ్యక్షుల్లో 22 జిల్లాల అధ్యక్షులు రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచార జరుగుతోంది. ఇప్పటికే సుమారు 8 జిల్లాల అధ్యక్షులు రాజీనామాలు చేసేసారు. మరో 6 మంది రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మిగిలిన వారు కూడా కొద్ది రోజుల్లో టిడిపిని వదిలేయటానికే నిర్ణయించుకున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

అయితె ఒక్క టీడీపీతోనె వ‌ల‌స‌లు ఆగిపోలేదు. తెరాస నేతలు కూడా కాంగ్రెస్ తో పాటు వెళ్ళబోతున్నారు అని విశ్వసనీయంగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి అధికారా పార్టీ తెరాస నాయకులు కొందరు వెళ్ళడం అనేది ఇప్పుడు ఆ జిల్లా లో టాక్ ఆఫ్ దీ టౌన్ గా మారింది. జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులు చింపుల శైలజ సత్యనారాయణరెడ్డి, ముంగి జ్యోతి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి రేవంత్ వెంట వెళ్లనున్నారని తెలుస్తోంది.

తెరాస – టీడీపీ పొత్తు ఉంటుంది అనే టాక్ రానుండడం తో వారు ప్రస్తుతం అయితే టీడీపీ లో ఉంటాం అని చెప్పారట. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి మాత్రం తన కార్యకర్తలతో సమావేశమై, రెండు రోజుల్లో ఏ విషయమూ చెబుతానని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఏమో కానీ ఈ జిల్లా పరిథి మరిన్ని ప్రాంతాల వరకూ ఈ ఎఫెక్ట్ గట్టిగా ఉంది అన్ని చెప్పాల్సిన ప‌నిలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -