ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోయిన్లు వారిపై జరిగిన లైంగిక వేధింపులను ఇప్పుడు బోల్ట్‌గా చెప్పేస్తున్నారు. ఈ మధ్యన ఇలా చెప్పడం పరిపాటి అయ్యింది. ఇలాంటి సెలబ్రిటీల జాబితాలో అందాల హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ చేరిపోయింది. తనకు ఎదురైన లైంగిక వేధింపులను చెప్పేసింది.
వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ’ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, దానిపై ప్రస్తావిస్తూ, ప్రతి అమ్మాయీ జీవితంలో వేధింపులు ఎదుర్కొంటుందని, తనకు తెలియకుండానే కొన్నిసార్లు జరిగిపోతుంటాయని చెప్పింది. ఉదాహరణలు వివరిస్తూ, బస్సులో కండక్టర్ తాకుతూ వెళ్లవచ్చని, తన జీవితంలోనూ పలుమార్లు ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది.
మాటలతో వేధించేవాళ్లు, తప్పుడు చూపులు చూసేవారు, అవసరం లేకున్నా దగ్గరకు వచ్చి తాకాలని చూసేవాళ్లు తనకు ఎంతో మంది ఎదురయ్యారని, చాలా సార్లు దూరం జరగాలని హెచ్చరిస్తుంటేదాన్ని వెల్లడించింది. ఆ సమయంలో పురుషులకు కలిగే ఆనందం ఏంటో తనకు తెలియడం లేదని చెప్పింది.
వాళ్లు చేసె పనులతో ఎంతో చిరాకును తెప్పించేవని, ఎంతో మంది ఆడవాళ్లకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందన్న సంగతి తనకు తెలుసునని పేర్కొంది. ఇక పురుషుల చూపులు తమను ఎంత బాధపెడతాయో అర్థం చేసుకోవాలని, వారికి కూడా ఓ తల్లి, ఓ సోదరి ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చింది హాట్ బ్యూటీ.