బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘శాక్రిడ్ గేమ్స్స అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి కుబ్రా సైత్ ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తుంది.ఇక్కడ వరకు బాగానే ఉంది.అయితే కుబ్రా సైత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన విమర్శలు చేసింది. సీన్ బాగా రాలేదంటూ, తనను మరోసారి న్యూడ్ గా కనిపించాలని చెబుతూ పదే పదే ఆయన కోరాడని, దీంతో తనకు ఏడుపు వచ్చిందని వాపోయింది. “నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసు.
సీన్ మరింత బాగా రావాలంటే, మరోసారి న్యూడ్ గా కనిపించాలి. అలా చేయాల్సిందే. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ వెబ్ సిరీస్ బయటకు వచ్చాక, నన్ను అందంగా తీశారని అంటావు” అని కశ్యప్ తనతో చెప్పేవారని తెలిపింది. పదేపదే నగ్న దృశ్యాలు తీస్తుండటం, షాట్ మీద షాట్ అలాగే నటించాల్సి రావడంతో తాను చాలాసార్లు ఏడ్చానని చెప్పింది. అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే తదితరులు వెబ్ సిరీస్‌లో నటించారు.