Thursday, May 9, 2024
- Advertisement -

అనుష్క.. అర్జున్ రెడ్డి చూసి ఏమన్నాదో తెలుసా..?

- Advertisement -

అర్జున్ రెడ్డి మూవీ.. వివాదాలతో మొదలై.. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవ‌ర్సీస్ లో కూడా దుమ్ము లేపుతోంది. అదిరిపోయే కలెక్షన్స్ తో ఈ సినిమా రికార్డు సృష్టిస్తోంది. ఈ మూవీని తమిళం, హిందీ బాషల్లో రీమేక్ చేయడానికి ధనుష్, రణవీర్ ఆసక్తి చూపిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ్, మ‌హేష్ బాబు, రానా, రాజమౌళి, నాని వంటి స్టార్స్.. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాని సందీప్ రెడ్డి అద్భుతంగా తీశాడని.. విజయ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో అదరగొట్టాడని కితాబిచ్చారు. రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్.. దేవసేనా అయిన అనుష్క అర్జున్ రెడ్డి త‌ప్ప‌క చూడవలసిన సినిమా అని చెప్పింది. త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఈ సినిమా గురించి త‌న అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది. ఈ సినిమా అద్భుతంగా ఉంద‌ని.. ఈ సినిమాలో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ నిజాయితీగా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాన‌ని చెప్పింది.

ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ లకు త‌న అభినంద‌న‌ల‌ను తెలిపింది. అనుష్క అర్జున్ రెడ్డి సినిమా సంబంధించి పాజిటివ్ గా ఫోస్ట్ పెట్టడంతో.. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగుంద‌ని, సూప‌ర్బ్ అని, ఈ సినిమాను మీరు ప్ర‌మోట్ చేసినందుకు థ్యాంక్స్ అని నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -