Tuesday, May 7, 2024
- Advertisement -

ఎదుటి వారికి నీతులు చెప్ప‌డంలో బాబు దిట్ట‌… అవి మాత్రం బాబుకు వ‌ర్తించ‌వు…

- Advertisement -

టీడీపీ నాయ‌కులు త‌ప్పు చేస్తె నో ప‌నిష్‌మెంట్‌….ఎమ్మెల్యేలు  ప్ర‌భుత్వ అధికారుల‌పై దాడులు చేస్తె నో ప‌నిష్‌మెంట్‌…భూకుంభ‌కోణాలు,ఇసుక మాఫియాలు చేస్తె నో ప‌నిష్‌మెంట్ ..ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామ చేయించ‌మంటె నో…ఏ…. ఈ డైలాగ్ మ‌న చంద్ర‌బాబు నాయుడికి స‌రిగ్గా స‌రిపోతుంది. నిప్పు అని నిత్యం సొంత‌ డ‌బ్బా కొట్టుకొనె ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయిడిగారి స్ట్రాట‌జి.

వంగ‌వీటి రంగాకుటుంబంపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల దుమారం తెలిసిందే. ఈ గొడ‌వ‌పై తాజాగా చంద్ర‌బాబు నీతి సూత్రాలు వ‌ల్లించారు. తప్పుడు పనులు చేస్తారని, అశాంతి సృష్టిస్తారని చంద్రబాబు వైసిపి నేత వంగవీటి రాధాకృష్ణ, వైసిపి నుంచి సస్పెండైన నేత గౌతం రెడ్డిపై వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనాయకుడి చేతిలో కీలుబొమ్మలా మారార‌ని… వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.’ అని చంద్రబాబు అన్నారు.

బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై వంగవీటి రాధా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు . దీంతో బాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక మాజీ ఎమ్మెల్యే అయిన తనను, మాజీ మహిళా ఎమ్మెల్యే అయిన తన తల్లిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లినా చంద్రబాబు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

టిడిపి నేతలు దాడులకు దిగినా పట్టించుకోర‌ని ఇదే సమయంలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఏం చేసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని రాధా మండిపడ్డారు. కొందరు టిడిపి ప్రజాప్రతినిధులు అధికారులపై దాడులకు కూడా దిగారని, అయినా చంద్రబాబు వారిని ఏమీ అనలేదన్నారు.

చంద్రబాబును జేసీ తిట్టినా పట్టించుకోని దుస్థితి టిడిపి ఉందని గట్టి కౌంటర్ ఇచ్చారు. త‌మ‌పై పోలీసులు దౌర్జ‌న్యంగా ప్ర‌వ‌ర్తిచార‌ని వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాధా డిమాండ్ చేశారు. అవ‌స‌రం అయితె న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. ఇత‌రుల‌కు నీతులు చెప్ప‌డానికె ఉంటాయిగాని…బాబు మాత్రం పాటించ‌రు.

వంగవీటి – గౌతమ్‌రెడ్డి గొడవని రాజకీయంగా క్యాష్‌ చేసుకుందామని టీడీపీలో కింది స్థాయి నేతలు ప్రయత్నిస్తే ప్రయత్నించొచ్చుగానీ, అధినేత.. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ ప్రయత్నం చేస్తే, ఆ ‘కక్కుర్తి’కి ఇదిగో ఇలాగే పంచ్‌లు పడిపోతాయ్‌ మరి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -