Tuesday, May 21, 2024
- Advertisement -

ఈసారి కొట్టేట్టే ఉన్నాడు..!

- Advertisement -

అంతా అతన్ని డైరెక్టర్ అనకుండా…. సెట్ డైరెక్టర్ అంటూ ఇంతకాలం ఆటపట్టించారు. అయితే ఆ సెట్ డైరెక్టర్ స్టామినా ఏంటో…చూపించే టైమొచ్చిందిప్పుడు.

కేవలం తన మార్క్ మ్యాటర్ తో ఫస్ట్ టైమ్ ట్రేడ్ లో సంచలనాలు సృష్టించడానికి అతను రెడీ అవుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ గుణశేఖర్ ఈసారి రికార్డులతో కొట్టేట్టే ఉన్నాడు.వరుసగా సక్సెసైన రెండు భారీ చిత్రాల పేర్లు చెప్పి…. మార్కెటింగ్ స్ట్రాటజీతో మ్యాజిక్ చేస్తున్నాడు. బాహుబలిని జక్కన్న నాలుగు బాషల్లో రిలీజ్ చేస్తే… ఈయనగారు ఒక ఆకు ఎక్కువే చదివి…. ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాడు. సెప్టెంబర్ 2నుంచి 4 తారీకుల మధ్యలో ఈ ఐదు భాషల్లో డబ్ అయిన సినిమా విడుదలకు నోచుకుంటోంది. కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనే ధీమాతో గుణశేఖర్ ఉన్నాడు

రుద్రమదేవిని బాహుబలి కంటే ఒక భాషలో ఎక్కువగానే రిలీజ్ చేస్తోన్న గుణశేఖర్ ఈ సినిమాపై పూర్తి  నమ్మకంతో ఉన్నాడు. బయ్యర్లు కూడా ఈసినిమాలో అనుష్క పాత్రపై నమ్మకాన్ని వెలిబుచ్చారు. అయితే 70కోట్లకు దాటి సినిమాను కొనుగోలు చేయడానికి మొదట్లో సంకోచించినా…. బాహుబలి, శ్రీమంతుడుకు వచ్చిన వసూళ్ళను చూసి రుద్రమదేవికి సైతం సై అనేస్తున్నారు. దీనికి తోడు 50 కోట్ల మార్కెటున్న బన్నీ… గోనగన్నారెడ్డి పాత్రలో రావడం బయ్యర్లకు మరింత ధైర్యాన్ని నూరిపోసింది. ఇక లేటెస్ట్ గా భలే క్లిక్ అయిన రానా…. చాళుక్య వీరభద్రుడిగా మరోసారి రాజు గెటప్ ను పోషించడం కూడా కలిసొచ్చే అంశంలాగానే కనిపిస్తోంది.

ఈసినిమాకు ఉన్న మూడు ప్లస్ పాయింట్స్ తో గుణశేఖర్ దందాను షురూ చేశాడు. మొదట్లో మందగించిన బిజినెస్…. తాజాగా పరిశ్రమలో జరిగిన అనూహ్య మార్పులతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఎవరు అవునన్నా కాదన్నా…. బాహుబలి,శ్రీమంతుడు లాంటి భారీ చిత్రాలు రుద్రమదేవికి మార్గం సుగుమమం చేశాయి. అందుకే టాప్ బయ్యర్లకు నేడు రుద్రమదేవి ఎంతో కలిసొచ్చేలా చేస్తోంది. అందుకే రిస్క్ చేసి మరీ అడుగులు ముందుకు వేసేస్తున్నారు.రుద్రమదేవిపై ఎంత నమ్మకం లేకపోతే…. గుణశేఖర్ కొన్ని ఏరియాలకు తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటాడు చెప్పండి.సో ఫైనల్ గా రుద్రమదేవితో గుణా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -