Wednesday, May 15, 2024
- Advertisement -

కాళ్ళు లేకపోయినా అందరికి ఆదర్శంగా నిలిచాడు..

- Advertisement -

ఇతని పేరు నరే‌ష్ కరుతుర. ఇతను మద్రాస్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. తర్వాత బెంగళూరులో గూగుల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

అందరూ చదువుకుంటారు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తారు. అయితే ఏంటి..? స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా..!  ఉందండీ..! అందరూ వేరు నరేష్ వేరు. ఎందుకంటే ఈ స్టోరీ చదవండి మీకే అర్థమవుతుంది. విది ఇతని జీవితంతో బాగా ఆడుకుంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తను అనుకున్నది చేయలనుకున్నాడు. చేసి నిరూపించాడు. అసలు విషయం ఏంటంటే… ఇతనికి రెండు కాళ్ళు ఒక యాక్సిడెంట్‌లో పోయాయి. వీల్‌ చైర్‌లో మాత్రమే వెళ్ళగలడు ఎక్కడికైనా… అయినా అతని ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. ఎల్లప్పుడు నా కోసం దేవుడు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అందుకే నేను లక్కీగా ఫీలవుతాను. నిరుత్సాహపడను అని చెప్తున్నాడు. అందుకేనేమో ఇతను అంతటి స్థాయికి ఎదిగాడు. 

నరేష్ తన స్టోరిని తనే చెప్పాడు.. నా మొదటి ఏడు సంవత్సరాలు ఆంద్ర ప్రదేశ్‌లో గోదావరి తీరాన ఉన్న తిరేరు అనే గ్రామంలో గడిపాను. మా నాన్న ప్రసాద్ ఒక లారీ డ్రైవర్. మా అమ్మ కుమారి హౌస్‌ వైఫ్. నా తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు. అందుకే మా పేరెంట్స్  నన్ను, మా సిస్టర్ సిరీష‌ను బాగా చదివించాలనుకున్నారు. అందుకే మా ఫాదర్ గ్రామం నుంచి టౌన్‌కి చేరారు. కేవలం మా చదువు కోసం. నాకు ఆడుకోవడమంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ గ్రౌండ్‌లోనే నా ఫ్రెండ్స్‌తో ఆడుకునే వాడిని. స్కూల్‌లో ఎప్పుడూ టాపర్‌గా ఉండడం వలన నాకు టీచర్స్ బాగా క్లోజ్‌గా ఉండేవారు. చాలా సందర్భాల్లో స్కూల్ అయిన తర్వాత టీచర్స్‌ వడిలో పడుకెనే వాడిని. అంతలా నన్ను అభిమానించేవారు. అప్పుడే మాకు సంక్రాంతి హాలిడేస్‌ వచ్చాయి. 

అందరం ఊరికి వెళ్తున్నాం. మా నాన్న లారీ వేసుకొని వచ్చాడు. అందులో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మా ఏరియాలో సంక్రాంతి పండుగ చాలా గ్రాండ్‌గా జరుపుకుంటారు. అందుకే అందరం ఊరికి వెళ్తున్నాం. ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు బస్సులు బంద్ కావడంతో రాలేకపోయింది. అందుకే మా లారీలో కూడా అంతమంది జనాభా ఉన్నారు. మా నాన్న నన్ను పక్కనే కూర్చొబెట్టుకున్నాడు. నేను డోర్ సరిగ్గా వేయలేదు. టర్న్‌ అవుతున్నప్పుడు ఆ డొర్ ఓపెన్ అవ్వటంతో కింద పడిపోయాను. అక్కడ కొన్ని రాడ్స్ ఉండటం వలన అవి వచ్చి నా రెండు కాళ్ళపై పడ్దాయి. అప్పుడు నేను ఏదో స్ర్కాచెస్ అయ్యాయి అనుకున్నా.. గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. అక్కడ ట్రీ‍ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ మా నాన్నకి ఇక్కడికి కాదు ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ చేయించండి ఇక్కడ అన్ని సౌకర్యాలు లేవని చెప్పారు. మా ఫాదర్ దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనే చిన్న డాక్టర్స్‌తో ట్రీ‍ట్‌మెంట్ చేపించేవారు. మూడు నెలల తర్వాత మా ఫాదర్ నన్ను అలా చూడలేక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు చాలా ఆలస్యమైంది. రెండు కాళ్ళు తీసెయ్యాలి అని చెప్పారు. 

ఆ వార్త విని మా పేరెంట్స్ శోక సముద్రంలో మునిగి పోయారు. చివరికి వారం తర్వాత చూస్తే నాకు రెండు కాళ్ళు లేవు. మొదట్లో చాలా బాద పడేవాన్ని. తర్వాత నా సిస్టర్, పేరెంట్స్ సహాయంతో అలవాటు పడిపోయాను. మళ్ళీ టౌన్‌కి వచ్చాం. నేను నా చెల్లి ఒకటే తరగతి కావడంతో నాకు మా సిస్టర్ చాలా హెల్ప్‌గా ఉండేది. 10th క్లాస్‌లో నాకు 542/600 మార్క్స్ వచ్చాయి. నాకు ఒక కల ఉండేది. ఐఐటి ర్యాంక్ సంపాదించి అక్కడ చదవాలని ఉండేది. దీనికి మా మ్యాథ్స్‌ టీచర్ ప్రమోద్ లాల్ హెల్ప్‌ చేశారు. నా ఇంట్రెస్ట్‌ను చూసి తన బలంతో నాకు గౌతమ్ జూనియర్ కాలేజీలో ఐఐటి ప్రిపేర్ అయ్యేందుకు పర్మిషన్ ఇప్పించారు. లేకపోతే మా పేరెంట్స్ అంత డబ్బులు కట్టలేరు. ఎందుకంటే అక్కడ సంవత్సరానికి 50,000 లు అవుతుంది. నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. 

అక్కడ ఒక వ్యక్తి నాకుఇన్స్పి‌రేషన్‌గా నిలిచాడు. అతను ఇండియాలో టాప్‌10 ఐఐటి ర్యాంకు సాధింఛిన వారిలో ఈయన ఒకరు. ఆయన పేరు K.K.S భాస్కర్. మా పేరేంట్స్‌కి గౌతమ్ జూనియర్ కాలేజి గురించే తెలిసేది కాదు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు కాదు. 

తర్వాత మద్రాస్‌ ఐఐటి‌లో సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ అయి కంప్యూటర్ సైన్స్ చేశాను. ఇక్కడే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేశాను. మొదటి సంవత్సరం అక్కడ కంప్లీట్ అవ్వగానే మా పేరెంట్స్‌‍ని కష్టపెట్టకూడదని జాబ్‌కి ప్రిపేర్ అయ్యాను. గూగుల్‌ సంస్థలో చేయడం నాకు చాలా ఇష్టం అందుకే ఆ కంపెనీకి మాత్రమే అప్లై చేశాను. నేను సెకండ్ ఇయర్‌ లో ఉన్నప్పుడే జాబ్ కన్పర్మ్ అయింది. మా డిపార్ట్‌మ్ంట్ కూడా నన్ను సత్కరించింది. ఇప్పుడు బెంగళూరు గూగుల్ సంస్థలో జాబ్ చేస్తున్నాను.      

మొదటగా నన్ను నేను నమ్ముతాను తర్వాత దేవుడిని నమ్ముతాను అని చెప్తున్నాడు నరేష్..

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -