Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ కి బాగా ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చి సర్‍ ప్రైజ్ చేసిన స్వీటీ అనుష్క

- Advertisement -

మాములుగా సినీ పరిశ్రమలో.. హీరో, హీరోయిన్స్ ఒక మూవీలో నాలుగు నెలలు కలిసి పని చేస్తానే.. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. మరి అలాంటిది ఒక్క సినిమా కోసం ఐదేళ్లు కలిసి పని చేసిన నటీనటులు ఇంకెంత క్లోజ్ గా ఉండాలి. టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఇప్పుడు ఉన్నది ఎవరో కాదు.

స్వీటీ అనుష్క అలాగే బాహుబలి ప్రభాస్. అంతకు ముందు వీరు కలిసి సినిమాలు చేసిన నార్మల్ గానే ఉండేవారు. కానీ బాహుబలి లో కలిసి నటించాక.. అప్పటి నుండి ప్రాణ స్నేహితులు అయ్యారు. ఎంతలా అంటే వీరి స్నేహాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకునే వరకు వచ్చింది. కానీ ప్రభాస్ మాత్రం అలాంటిదేమి లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సంగతి తెలిసిందే. సాహో మూవీ యూనిట్ ప్రభాస్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. ఇంకా కొందరు ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ ని తెలిపారు.

కానీ అందాల భామ అనుష్క మాత్రం మంచి గిఫ్ట్ ఇచ్చింది. ప్రభాస్ ఇష్టాన్ని తెలుసున్న ఈ క్లోజ్ ఫ్రెండ్.. ప్రభాస్ కి డిజైనర్ వాచీలంటే చాలా ఇష్టమని… ఎంతో ఇష్టంగా డిజైనర్ వాచీని బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అనుష్క అందరిలా కాకుండా ప్రభాస్ ఇష్టాన్ని తెలుసుకొని.. ఎప్పటికి గుర్తుండి పోయేలా ప్రభాస్కి గిఫ్ట్ ఇచ్చి ఫిదా చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -