Wednesday, May 8, 2024
- Advertisement -

లఖ్‌నవూ-ఆగ్రా హైవేపై వైమానికదళ విన్యాసాలు … విన్యాసాల‌ను తిల‌కించేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జ‌లు

- Advertisement -

యుద్ధ సమయాల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా ఇక్కడి జాతీయ రహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలిసారి నడిరోడ్డుపై యుద్ధ విమానాలు ఈ విన్యాసాలు చేశాయి.

లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై మంగళవారం ఉదయం అరుదైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు సందడి చేశాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

భారత వాయుసేనకు చెందిన 16 యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం లఖ్‌నవూ-ఆగ్రా హైవేపై ల్యాండ్‌ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు 65 కిలోమీటర్ల దూరంలోని ఉన్నాం జిల్లా బంగార్‌మౌ వద్ద వాయుసేన విన్యాసాలను చేపట్టింది. ఈ మార్గంలో రాకపోకలను నిషేధించారు.

భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఏన్‌-32, మిరాగే 2000, సుఖోయి ఎంకేఐ ఇలా మొత్తం 20 యుద్ధ విమానాలు ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్ మార్షల్‌ వైస్‌ చీఫ్ ఎస్‌బీ డియో ప్రకటించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో సైన్యం తొలిసారిగా నడిరోడ్డుపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయించింది. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్ని సందడిని వీక్షించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి రోడ్డుకిరువైపులా నిల్చున్నారు. విమానాలు ల్యాండ్ అయిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రమాదాలు ఏం వాటిల్లకుండా పూర్తి భద్రతా చర్యలతోనే వీటిని నిర్వహించారు. మొత్తం మూడు గంటల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -