Friday, May 3, 2024
- Advertisement -

అనుష్క ఎప్పుడూ చూడ‌ని చిత్రం

- Advertisement -

అందాల తార అనుష్క ఫొటో ఒక‌టి జ‌నాల‌ను పిచ్చ‌క్కిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కు ఉన్న ఏకైక క‌థ‌నాయిక అనుష్క‌. బిల్లా సినిమాలో అందాల‌ను ఆర‌బోసిన ఆమె ఆ త‌ర్వాత న‌ట‌న‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఆ చిత్రం నుంచి అంత‌గా హాట్‌హాట్‌గా న‌టించ‌లేదు. ఏ డ్రెస్ వేసినా సూట‌య్యే అనుష్క బాహుబ‌లి-2లో సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించినా అందంగా క‌నిపించి మ‌త్తెక్కించింది. ఆ సినిమాలో న‌ట‌న‌లోనూ, అందంప‌రంగా మార్కులు కొట్టేసిన అనుష్క త‌ర్వాతి సినిమా కోసం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మధ్య అనుష్క పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ డ్రస్‌లో తన నడుము అందాలు కనిపించీ కనిపించనట్టుగా చూపిస్తూ ఓ స్టిల్ ఉంది.

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో గానీ ఆ చిత్రం కుర్ర‌కారును చూపుల‌తో గుచ్చిగుచ్చి చంపేస్తోంది. దీనికితోడు కైపెక్కించే ఆ చూపు ఎవరి గుండెల్లోనైనా కలవరం పెట్టించడం ఖాయం. బాహుబలి విజయం తరవాత అనుష్క మరోసారి లేడీ ఓరియంటెడ్ భాగమతి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. పిల్ల జమిందార్ ఫేం దర్శకుడు జి.అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్ – స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -