Saturday, May 18, 2024
- Advertisement -

అనుష్క అందులో ఎప్పుడు బెస్టే

- Advertisement -

ప్ర‌భాస్ – అనుష్క జోడి గురుంచి మ‌నం ప్ర‌త్యేకంగా చేప్పుకొవాల్సిన అవ‌స‌రం లేదు. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త అప్ప‌ట్లో బాగా చ‌క్క‌ర్లు కొట్టింది.ప్ర‌భాస్ – అనుష్క జోడి నాలుగు సినిమాల్లో న‌టించారు.బిల్లా,మిర్చి,బాహుబ‌లి-1,బాహుబ‌లి-2 సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.అనుష్క నటించిన తాజా చిత్రం ‘భాగమతి’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

27 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని ఇంకాస్త పెంచింది. అనుష్క పాత్ర‌పై ఎక్కడా లేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.టీజర్ చూసిన చాలా మంది ప్రేక్షకులు, సెలబ్రిటీలు అనుష్కను ఆకాశానికెత్తేస్తున్నారు.అందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. టీజర్ పై స్పందించిన ఆయన కొత్తగా ట్రై చేయడంలో స్వీటీ ఎప్పుడూ ముందే ఉంటుందన్న ఆయన సినిమా సక్సెస్ అవ్వాలని ఆమెకు, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -