Monday, May 20, 2024
- Advertisement -

అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది!

- Advertisement -

అందం పరంగా, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. సౌత్ లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్. బాహుబలి సినిమా తర్వాత అనుష్క క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది.

తాజాగా హైదరాబాద్ టైమ్స్ సంస్థ 2015 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సర్వేలో….ఎక్కువ మంది అనుష్కకే ఓటేసారు. అనుష్క తర్వాతి స్థానంలో హీరోయిన్ హీరోయిన్ శ్రీయ నిలిచింది.

ఇప్పుడంటే సినిమా అవకాశాలు తగ్గాయికానీ, దాదాపు దశాబ్ద కాలంగా సౌత్ లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలతో లీడింగులో ఉన్న తమన్నా, కాజల్, సమంతలు… టాప్ 5 లిస్టులో చోటు దక్కించుకున్నారు. శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, హేబ పటేల్, రాశి ఖన్నా, తాప్సీ తదితరులు టాప్ 10లో ఉన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -