Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ సరసన హీరోయిన్ గా మలయాళ భామ!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో అనుకున్న రెంజ్ లో హింట్ కొట్టాలేక పోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు పవన్. తాజాగా తనకి ఖుషి చిత్రంతో సూపర్ హిట్ అందించిన ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జూన్ నుండి మొదలు కానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పవన్ సరసన హీరోయిన్ గా ఈ చిత్రంలో మలయాళ భామ పార్వతి పరమేశ్వరన్ ని తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్వతి పరమేశ్వరన్ తో ఓ ఫోటో షూట్ కూడా చేసినట్లు సమాచారం.

త్వరలోనే ఈ విషయం పై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై పవన్ సన్నిహితుడు శరత్ మరర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయిన పవన్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -